అదనపు కట్నం కోసం వేధింపులు.. వివాహిత ఆత్మహత్య
దిశ, నర్సంపేట: అదనపు కట్నం కోసం అత్తింటి వారు చేస్తున్న వేధింపులను భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కొత్తగూడ మండలంలోని రాంపురం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాంపురం గ్రామానికి చెందిన వాంకుడోత్ రవళి(25)ని మూడు ఏండ్ల కిందట నర్సంపేటకు చెందిన వంశీవికాస్‌కు ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు. కొన్ని నెలలు సజావుగా సాగిన వీరి సంసార జీవితంలో కలతలు రేగాయి. అదనపు కట్నం తేవాలని భర్త వేధింపులు మొదలయ్యాయి. […]
దిశ, నర్సంపేట: అదనపు కట్నం కోసం అత్తింటి వారు చేస్తున్న వేధింపులను భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కొత్తగూడ మండలంలోని రాంపురం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాంపురం గ్రామానికి చెందిన వాంకుడోత్ రవళి(25)ని మూడు ఏండ్ల కిందట నర్సంపేటకు చెందిన వంశీవికాస్‌కు ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు. కొన్ని నెలలు సజావుగా సాగిన వీరి సంసార జీవితంలో కలతలు రేగాయి. అదనపు కట్నం తేవాలని భర్త వేధింపులు మొదలయ్యాయి.
క్రమక్రమంగా వేధింపులు పెరిగిపోయాయి. అత్తింటి వారు అందరూ జత కావడంతో ఈ వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో మనస్తాపానికి గురై వివాహిత తన తల్లి ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న గూడూరు సిఐ రాజి రెడ్డి, తహసిల్దార్ చందా నరేష్ లు మృతదేహాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గూడూర్ కు తరలించారు. మృతురాలి తండ్రి మచ్చ సూరయ్య ఫిర్యాదు మేరకు మృతురాలి భర్త, వారి కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసినట్లు తెలిపారు.