ఈరోజే కాదు.. ఏరోజైనా మాకు మీరు స్పెషలే

దిశ, వెబ్ డెస్క్: నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. ఈ సందర్భంగా మనం నర్సులకు చాలా గొప్పగా శుభాకాంక్షలు తెలపాల్సిన అవసరమున్నది. ఎందుకంటే ప్రస్తుతం యావత్ ప్రపంచమే కరోనా కోరకు చిక్కి కొట్టుమిట్టాడుతోన్నది. ప్రజలంతా విలవిలలాడుతున్నారు. ఈ మహమ్మారిని కట్టిడి చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ కూడా సకల ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా నర్సుల పాత్ర కీలకమని చెప్పాలి. కరోనా సోకిన వారికి ఆసుపత్రులలో నర్సులు చేస్తున్న సేవలు మరువలేనివి. అది భయంకరమైన వ్యాధి అయినా కూడా […]

Update: 2020-05-12 02:08 GMT

దిశ, వెబ్ డెస్క్: నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. ఈ సందర్భంగా మనం నర్సులకు చాలా గొప్పగా శుభాకాంక్షలు తెలపాల్సిన అవసరమున్నది. ఎందుకంటే ప్రస్తుతం యావత్ ప్రపంచమే కరోనా కోరకు చిక్కి కొట్టుమిట్టాడుతోన్నది. ప్రజలంతా విలవిలలాడుతున్నారు. ఈ మహమ్మారిని కట్టిడి చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ కూడా సకల ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా నర్సుల పాత్ర కీలకమని చెప్పాలి. కరోనా సోకిన వారికి ఆసుపత్రులలో నర్సులు చేస్తున్న సేవలు మరువలేనివి. అది భయంకరమైన వ్యాధి అయినా కూడా వారు దానికి ఏ మాత్రం భయపడకుండా ఫ్లోరెన్స్ నైటింగేల్, మదర్ థెరిస్సా స్ఫూర్తితో ముందుకువెళ్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే మనం వారి సేవలను కొనియాడుతూ మరోసారి వారికి అంతర్జాతీయ నర్సుల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపాలి.

Tags:    

Similar News