Shocking news : పెండింగ్ జీతం ఇవ్వాలన్నందుకు చేతులు నరికేసారు..

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో క్రైమ్ కల్చర్ బాగా పెరిగిపోతోంది. ప్రతీ చిన్న విషయానికే కొందరు తమ సహనాన్ని కోల్పోయి ఆవేశంతో నేరాలకు పాల్పడుతున్నారు. అయితే, వీరికి మన దేశంలోని చట్టాలు, పోలీసులు అంటే గౌరవం, భయం లేకపోవడమే కారణమని తెలుస్తోంది. భయం ఉన్నవారు ఎప్పుడు నేరం చేసే ముందు ఒక్కసారి ఆలోచిస్తారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే ఈ నేరాలు ఎక్కువగా కుటుంబంలోని గొడవలు, ఆస్తులు, ఆర్థిక లావాదేవీలు, మోసం వలన జరుగుతున్నాయని కొన్ని సర్వేలు […]

Update: 2021-11-21 06:14 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో క్రైమ్ కల్చర్ బాగా పెరిగిపోతోంది. ప్రతీ చిన్న విషయానికే కొందరు తమ సహనాన్ని కోల్పోయి ఆవేశంతో నేరాలకు పాల్పడుతున్నారు. అయితే, వీరికి మన దేశంలోని చట్టాలు, పోలీసులు అంటే గౌరవం, భయం లేకపోవడమే కారణమని తెలుస్తోంది. భయం ఉన్నవారు ఎప్పుడు నేరం చేసే ముందు ఒక్కసారి ఆలోచిస్తారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే ఈ నేరాలు ఎక్కువగా కుటుంబంలోని గొడవలు, ఆస్తులు, ఆర్థిక లావాదేవీలు, మోసం వలన జరుగుతున్నాయని కొన్ని సర్వేలు చెబుతున్నారు. అయితే, తాజాగా జరిగిన ఓ ఘటన మాత్రం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

తనతో పని చేయించుకుని జీతం చెల్లించాలని అడిగినందుకు ఆ వ్యక్తి చేతులు నరికేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా జిల్లాలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా జిల్లాలో అశోక్ సాకేత్(45) అనే వ్యక్తి కార్మికుడుగా పనిచేస్తూ అతని కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే యజమాని వద్దకు వెళ్లి తనకు రావాల్సిన జీతం ఇవ్వాలని కోరాడు. సరిగ్గా ఇదేటైంలో ఇరువురి మధ్య మాటమాట పెరిగింది. దీంతో గణేశ్ మిశ్రా, అతని సోదరులు కలిసి సాకేత్‌పై అటాక్ చేశారు. ఆ తర్వాత అతన్ని చేతులు నరికేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Tags:    

Similar News