ఆ నొప్పి భరించలేక చాలామందితో సెక్స్ చేశా : స్టార్ హీరో సంచలన కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్ : హాలీవుడ్ స్టార్ యాక్టర్ విల్‌స్మిత్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవల విల్ స్మిత్ తన జీవిత చరిత్రపై రాసిన పుస్తకంలో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు.16 సంవత్సరాల వయస్సులోనే తన ప్రేయసితో బ్రేకప్ అయిందని విల్ స్మిత్ తెలిపాడు. దీంతో నేను చాలా బాధపడ్డానని, ఆ నొప్పిని భరించలేక పోయానని అన్నాడు. ఆ అమ్మాయి నుంచి తన దృష్టిని మరల్చేందుకు, డిప్రెషన్‌కు గురికాకుండా ఉండేందుకు తను చాలా మంది అమ్మాయిలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నానని […]
దిశ, వెబ్‌డెస్క్ : హాలీవుడ్ స్టార్ యాక్టర్ విల్‌స్మిత్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవల విల్ స్మిత్ తన జీవిత చరిత్రపై రాసిన పుస్తకంలో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు.16 సంవత్సరాల వయస్సులోనే తన ప్రేయసితో బ్రేకప్ అయిందని విల్ స్మిత్ తెలిపాడు. దీంతో నేను చాలా బాధపడ్డానని, ఆ నొప్పిని భరించలేక పోయానని అన్నాడు. ఆ అమ్మాయి నుంచి తన దృష్టిని మరల్చేందుకు, డిప్రెషన్‌కు గురికాకుండా ఉండేందుకు తను చాలా మంది అమ్మాయిలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నానని పుస్తకంలో రాసుకొచ్చాడు. ఇదంతా ఆ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికే అని పేర్కొన్నాడు. ఇలా ఇంత మంది అమ్మాయిలతో సంబంధం కొనసాగించడం వల్ల తన ఆరోగ్యం పాడు అయిందని విల్ స్మిత్ తెలిపాడు.