ఎయిమ్స్ పీజీ టెస్టు టాపర్ గుంటూరు యువతి
దిశ, ఏపీ బ్యూరో: దేశంలోని వైద్య విద్యలో ప్రతిష్ఠాత్మక సంస్థగా న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌ను పేర్కొంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఎయిమ్స్ న్యూఢిల్లీ నిర్వహించిన పీజీ ఎంట్రెన్స్ టెస్ట్‌లో తెలుగు తేజం టాపర్‌గా నిలిచి సత్తాచాటారు. భువనేశ్వర్ ఎయిమ్స్‌లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరుకు చెందిన డాక్టర్ వినీతా కన్నెగంటి ఎయిమ్స్ పీజీ పరీక్షలో టాపర్‌గా నిలిచారు. జూన్ 11న ఈ పరీక్ష జరిగింది. పరీక్ష ఫలితాలు తాజాగా వెల్లడించారు. ఈ పరీక్షలో వినీతతో పాటు భువనేశ్వర్ ఎయిమ్స్ కు […]
దిశ, ఏపీ బ్యూరో: దేశంలోని వైద్య విద్యలో ప్రతిష్ఠాత్మక సంస్థగా న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌ను పేర్కొంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఎయిమ్స్ న్యూఢిల్లీ నిర్వహించిన పీజీ ఎంట్రెన్స్ టెస్ట్‌లో తెలుగు తేజం టాపర్‌గా నిలిచి సత్తాచాటారు. భువనేశ్వర్ ఎయిమ్స్‌లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరుకు చెందిన డాక్టర్ వినీతా కన్నెగంటి ఎయిమ్స్ పీజీ పరీక్షలో టాపర్‌గా నిలిచారు. జూన్ 11న ఈ పరీక్ష జరిగింది. పరీక్ష ఫలితాలు తాజాగా వెల్లడించారు. ఈ పరీక్షలో వినీతతో పాటు భువనేశ్వర్ ఎయిమ్స్ కు చెందిన 74 మందికి ర్యాంకులు వస్తే, వారిలో ఆరుగురు వంద లోపు ర్యాంకులు సాధించడం విశేషం. దీనిపై డాక్టర్ వినీత మాట్లాడుతూ.. పీజీలో జనరల్ మెడిసిన్‌ను ఎంచుకుంటానని చెప్పారు. గత డిసెంబర్‌లోనే ఎంబీబీఎస్ పూర్తిచేశానని, అప్పటి నుంచి పీజీ ఎంట్రన్స్ కోసం సిద్ధమయ్యానని తెలిపారు. పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కడంతో ఆనందంగా ఉందని అన్నారు. పీజీని ఢిల్లీ ఎయిమ్స్ లేదా చండీగఢ్‌లోని మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో పూర్తి చేస్తానని తెలిపారు.