పులివెందులలో తుపాకీ కాల్పులు.. ఇద్దరు మృతి

దిశ, ఏపీ బ్యూరో: కడప జిల్లా పులివెందుల మండలం నల్లపురెడ్డి పల్లిలో మంగళవారం వైసీపీకి చెందిన రెండు కుటుంబాల మధ్య ఘర్షణ రేగింది. ఈ సందర్భంగా జరిగిన తుపాకీ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. పార్థసారధి రెడ్డి (48), ప్రసాద్ రెడ్డి ( 62 ) అనే ఇరువురు బంధువులు. వీరి కుటుంబాల మధ్య పాత కక్షలున్నాయి. ఉదయం ప్రసాద్ రెడ్డి కత్తి తీసుకొని పార్థసారధి రెడ్డిపై దాడికి యత్నించాడు. ఆందోళనతో ప్రసాద్ రెడ్డి తన దగ్గర […]

Update: 2021-06-15 10:44 GMT

దిశ, ఏపీ బ్యూరో: కడప జిల్లా పులివెందుల మండలం నల్లపురెడ్డి పల్లిలో మంగళవారం వైసీపీకి చెందిన రెండు కుటుంబాల మధ్య ఘర్షణ రేగింది. ఈ సందర్భంగా జరిగిన తుపాకీ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. పార్థసారధి రెడ్డి (48), ప్రసాద్ రెడ్డి ( 62 ) అనే ఇరువురు బంధువులు. వీరి కుటుంబాల మధ్య పాత కక్షలున్నాయి. ఉదయం ప్రసాద్ రెడ్డి కత్తి తీసుకొని పార్థసారధి రెడ్డిపై దాడికి యత్నించాడు. ఆందోళనతో ప్రసాద్ రెడ్డి తన దగ్గర ఉన్న లైసెన్స్ తుపాకీతో పార్థసారధి రెడ్డిపై కాల్పులు జరిపాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం అదే తుపాకితో ప్రసాద్ రెడ్డి కూడా కాల్చుకొని ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో గొడవలు పెరగకుండా పోలీసులు పికెట్​ ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News