కాయ్ రాజా కాయ్.. గుడుంబా ఫుల్.. కేసులు నిల్!

దిశ ,ఓదెల : ఎక్సైజ్ శాఖ అధికారులు మామూళ్లు తీసుకుంటూ గుడుంబా విక్రయాలకు ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లో వారికి దారులు తెరుస్తున్నారు. దీంతో ఒకవైపు మామూళ్లు ఇంకోవైపు గుడుంబా విపరీతంగా పెరిగి పోతున్నాయి. దాంతో నమోదు చేయాల్సిన కేసులు నిల్ అవుతున్నాయి. డబ్బులు తీసుకుని పట్టుకున్న నిందితులను, వాహనాలను కూడా వారికే ముట్ట జెప్తున్నారు. ఏదో తూ తూ మంత్రంగా లీటరో, అరలీటరో పట్టుకుని దొరికిన వ్యక్తులను తీసుకువచ్చి వారి వద్ద ఎక్కువ లభించినట్లు రికార్డులను […]

Update: 2021-11-09 01:36 GMT

దిశ ,ఓదెల : ఎక్సైజ్ శాఖ అధికారులు మామూళ్లు తీసుకుంటూ గుడుంబా విక్రయాలకు ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లో వారికి దారులు తెరుస్తున్నారు. దీంతో ఒకవైపు మామూళ్లు ఇంకోవైపు గుడుంబా విపరీతంగా పెరిగి పోతున్నాయి. దాంతో నమోదు చేయాల్సిన కేసులు నిల్ అవుతున్నాయి. డబ్బులు తీసుకుని పట్టుకున్న నిందితులను, వాహనాలను కూడా వారికే ముట్ట జెప్తున్నారు. ఏదో తూ తూ మంత్రంగా లీటరో, అరలీటరో పట్టుకుని దొరికిన వ్యక్తులను తీసుకువచ్చి వారి వద్ద ఎక్కువ లభించినట్లు రికార్డులను సృష్టిస్తూ కేసులు నమోదు చేస్తున్నారు.

గుడుంబా విక్రయ దుకాణాలు ప్రతినెల తప్పనిసరిగా సుల్తానాబాద్ ఎక్సైజ్ ఉన్నతాధికారికి ముట్టజెప్పక పోతే వారు గుడుంబా విక్రయించుకోకూడదు. మామూళ్లు ఇచ్చిన తరువాత ఇష్టం వచ్చినంత గుడుంబా ను అమ్ముకోవచ్చు. మామూళ్లు చెల్లించని వారి షాపుల పై దాడులు చేసి కేసులు నమోదు చేస్తారు. వాళ్లను కూడా రెండు మూడు రోజుల తరువాత విడుదల చేయడం ఇక్కడ సర్వసాధారణంగా మారిపోయింది.

అధికారి మారితే మామూళ్లు పెరుగుతాయి

సుల్తానాబాద్ ఎక్సైజ్ పరిధిలో ఉన్నతాధికారి మారితే మామూళ్ళు కూడా పెంచాల్సిందేనట. మోటార్ వెహికల్ పై రవాణా చేసే వారి వద్ద నుంచి నెలకు వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. గుడుంబా రవాణా దారులను, విక్కీ దాదాలను పట్టు కుని డబ్బులు తీసుకుని వదిలి పెట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి.

ఉద్యోగం ఎన్టీపీసీలో.. మామూళ్లు ఇక్కడ,!!

ఓదెల మండలం లోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి ఎన్టీపీసీలోని ఎక్సైజ్ శాఖ లో పని చేస్తున్నాడు. ఇతను పండుగలకు, పబ్బాలకు స్వగ్రామానికి వస్తాడు. ఇలా వచ్చినప్పుడు ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లో గుడుంబా విక్రయదారుల నుండి బలవంతంగా మామూళ్లు వసూలు చేస్తున్నాడని సమాచారం. తాను ఎక్సైజ్ శాఖ సాకాడ్ లో పని చేస్తున్నానని ఎక్కడైనా పట్టుకోవచ్చని గుడుంబా అమ్మే వారిని బెదిరించి డబ్బుల వసూలు చేస్తున్నాడు. ఈ విషయంపై సీఐ సామేల్ ఆనందరావు ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా సమాధానం ఇవ్వకుండా దాటవేశారు.

Tags:    

Similar News