నకిలీ గడ్డి మరకల జీన్స్.. ధర రూ. 80 వేలు

దిశ, వెబ్‌డెస్క్: లగ్జరీ డిజైనర్ బ్రాండ్‌లు ఎప్పటికప్పుడు తమ వెరైటీ కలెక్షన్లతో అందరినీ ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాయి. అందుకే ఆ బ్రాండ్‌లు ఎలాంటి దుస్తులను విడుదల చేసినా వాటికి ఎంతపెట్టి కొనడానికైనా జనాలు సిద్ధంగా ఉంటారు. ఆ క్రమంలోనే ప్రముఖ లగ్జరీ బ్రాండ్ ‘గుచ్చీ’ కొత్త వింటర్ కలెక్షన్‌లో భాగంగా ఒక కొత్త రకం జీన్స్‌ను విడుదల చేసింది. బెల్ట్‌లు, జాకెట్‌లు, బ్యాగ్‌ల మీద వినూత్న డిజైన్లు, నమూనాలకు పేరుపొందిన గుచ్చీ విడుదల చేసిన ఈ జీన్స్‌లో కొంచెం […]

Update: 2020-09-23 05:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: లగ్జరీ డిజైనర్ బ్రాండ్‌లు ఎప్పటికప్పుడు తమ వెరైటీ కలెక్షన్లతో అందరినీ ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాయి. అందుకే ఆ బ్రాండ్‌లు ఎలాంటి దుస్తులను విడుదల చేసినా వాటికి ఎంతపెట్టి కొనడానికైనా జనాలు సిద్ధంగా ఉంటారు. ఆ క్రమంలోనే ప్రముఖ లగ్జరీ బ్రాండ్ ‘గుచ్చీ’ కొత్త వింటర్ కలెక్షన్‌లో భాగంగా ఒక కొత్త రకం జీన్స్‌ను విడుదల చేసింది. బెల్ట్‌లు, జాకెట్‌లు, బ్యాగ్‌ల మీద వినూత్న డిజైన్లు, నమూనాలకు పేరుపొందిన గుచ్చీ విడుదల చేసిన ఈ జీన్స్‌లో కొంచెం ప్రత్యేకత ఉంది. అయితే ఈ ప్రత్యేకత కోసం రూ. 80 వేలు ఖర్చుపెట్టాలంటే మాత్రం కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుందనుకోండి. ఇంతకీ ఆ ప్రత్యేకత ఏంటంటారా?

ఒక జీన్స్ ధరించి కాసేపు పచ్చిగడ్డిలో దొర్లితే, ఆ జీన్స్‌కు ఆకుపచ్చ రంగు మరకలు అవుతాయి. ఇలా నకిలీ గడ్డి మరకలు ఉండటమే ఇప్పుడు గుచ్చీ విడుదల చేసిన కొత్త జీన్స్ ప్రత్యేకత. దీని ధర 1200 డాలర్లు అంటే అక్షరాల రూ. 88,290. సేంద్రీయ కాటన్‌తో తయారైన ఈ జీన్స్ మీద ఎలాంటి నమూనా లేకుండా ఉన్న ఆకుపచ్చ రంగు గడ్డి మరకలే దీని ప్రత్యేకత అని గుచ్చీ ఈ జీన్స్‌ను నిర్వచించింది. గుచ్చీ ఇలా మరకలు పడిన ఉత్పత్తులను అమ్మడం కొత్తేమీ కాదు. గతేడాది పూర్తిగా మురికి పడిన స్నీకర్‌లను కూడా విడుదల చేసింది. అప్పట్లో వీటి ధర 840 డాలర్లు. అంటే దాదాపుగా 60 వేలు. 70ల దశకంలో స్నీకర్‌లను ఆదర్శంగా తీసుకొని తయారుచేసిన ఆ స్నీకర్ల గురించి సోషల్ మీడియా తీవ్రంగా విమర్శించింది.

Tags:    

Similar News