ప్రియుడి ఎంటర్… పోలీస్‌స్టేషన్ మెట్లెక్కిన వధువు

దిశ, హుజురాబాద్: ధూం ధాంగా పెళ్లి బరాత్ జరుగుతోంది. అంతలోనే ఓ యువకుడు అక్కడకు చేరుకున్నాడు. నన్ను ప్రేమించి, మరొకరిని పెళ్లి చేసుకుంటావా? అంటూ వీరంగం సృష్టించాడు. అప్పటివరకూ పెళ్లి అయిపోయి బరాత్ సంతోషంలో వధువరుల కుటుంబాలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇంతకీ ఏం జరిగిందో మాత్రం అంతుచిక్కలేదు. విషయం అంతా విన్న పెళ్లి కొడుకు ప్రవీణ్ హుజురాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. సోమవారం రాత్రి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో జరిగిన ఈ ఘటన సినిమాను తలపించింది. […]

Update: 2020-08-25 04:50 GMT

దిశ, హుజురాబాద్: ధూం ధాంగా పెళ్లి బరాత్ జరుగుతోంది. అంతలోనే ఓ యువకుడు అక్కడకు చేరుకున్నాడు. నన్ను ప్రేమించి, మరొకరిని పెళ్లి చేసుకుంటావా? అంటూ వీరంగం సృష్టించాడు. అప్పటివరకూ పెళ్లి అయిపోయి బరాత్ సంతోషంలో వధువరుల కుటుంబాలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇంతకీ ఏం జరిగిందో మాత్రం అంతుచిక్కలేదు. విషయం అంతా విన్న పెళ్లి కొడుకు ప్రవీణ్ హుజురాబాద్ పోలీసులను ఆశ్రయించాడు.

సోమవారం రాత్రి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో జరిగిన ఈ ఘటన సినిమాను తలపించింది. దీంతో వరుడు ప్రవీణ్ పోలీసులను ఆశ్రయించాడు. అనంతరం పోలీసులు ఎంటర్ అయి బరాత్‌ను అడ్డుకున్న శ్రీపతి వంశీ అనే యువకుడిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. విషయం మొత్తం తెలిసిన వరుడు ప్రవీణ్ వధువును పోలీసు స్టేషన్‌లోనే వదిలేసి తన స్వగ్రామమైన మంచిర్యాల జిల్లా మందమర్రికి వెల్లిపోయాడు. అంతేగాకుండా వధువు తల్లిదండ్రులు కూడా ఆమెను స్టేషన్‌లోనే వదిలి వెళ్లడంతో పోలీసులు కరీంనగర్‌లోని స్వధార్ హోంకు ఆమెను తరలించారు. కేసు దర్యాప్తు చేసి, పూర్తి వివరాలు సేకరిస్తామని హుజురాబాద్ ఏసీపీ సుందరగిరి శ్రీనివాస రావు తెలిపారు.

Tags:    

Similar News