బెదిరింపులకు భయపడను.. రైతులతోనే నేను : గ్రేటా థన్‌బర్గ్
దిశ, వెబ్‌డెస్క్ : కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ గత రెండు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.దీనికి మద్దతుగా స్వీడిష్‌కు చెందిన 18ఏళ్ల పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్‌బర్గ్ ట్విట్టర్ వేదికగా స్పందించిన విషయం తెలిసిందే. అయితే, రైతుల ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని దేశం పరువు తీసేందుకు అంతర్జాతీయ వ్యాప్తంగా కుట్ర జరుగుతోందని నెటిజన్స్ ఆమెపై విమర్శలు గుప్పించారు. I still #StandWithFarmers and support their peaceful protest.No amount […]
దిశ, వెబ్‌డెస్క్ : కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ గత రెండు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.దీనికి మద్దతుగా స్వీడిష్‌కు చెందిన 18ఏళ్ల పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్‌బర్గ్ ట్విట్టర్ వేదికగా స్పందించిన విషయం తెలిసిందే. అయితే, రైతుల ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని దేశం పరువు తీసేందుకు అంతర్జాతీయ వ్యాప్తంగా కుట్ర జరుగుతోందని నెటిజన్స్ ఆమెపై విమర్శలు గుప్పించారు.
I still #StandWithFarmers and support their peaceful protest.
No amount of hate, threats or violations of human rights will ever change that. #FarmersProtest— Greta Thunberg (@GretaThunberg) February 4, 2021
అంతకుముందు ఆందోళనకారులను అడ్డుకునేందుకు కేంద్రం ముళ్లకంచెలు, మేకులు పెట్టడాన్ని భారత ప్రభుత్వం రైతులపై ‘టూల్ కిట్’ ప్రయోగిస్తుంది అనే అర్థం వచ్చేలా కామెంట్ చేశారు. దీంతో సామాజిక మాద్యమాల్లో ఆమెపై విమర్శల వర్షం కురిసింది. అందుకు ప్రతిస్పందనగా.. ‘‘ద్వేషం, బెదిరింపులు, మానవ హక్కుల ఉల్లంఘనలు ఎప్పటికీ మారవు.. శాంతియుతంగా రైతులు చేస్తున్న నిరసనలకు తన సపోర్టు ఉంటుందని’’ గ్రేటా మరోసారి ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.