చింతచెట్టులో బాంబులు.. కాపాడిన ‘ఫ్రీ ఫైర్’

దిశ ప్రతినిధి, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దూమాల గ్రామంలో చింత చెట్టు తొర్రలో రెండు గ్రెనేడ్ బాంబులు ప్రత్యక్షమయ్యాయి. ఈ ఘటన గురువారం వెలుగుజూసింది. వివరాళ్లోకి వెళితే.. దూమాల గ్రామానికి చెందిన మల్లేష్ అనే బాలుడు శనివారం ఉదయం వేళ చలి కాచుకోవడానికి తన ఇంటి సమీపంలో మోడువారిన చింతచెట్టు వద్ద గడ్డిని తీసుస్తుండగా చెట్టు తొర్రలో నుంచి రెండు గ్రానైట్ బాంబులు కిందపడ్డాయి. బాలుడు మొబైల్ ఫోన్‌లో తరచూ ఆడే ‘ఫ్రీ […]

Update: 2020-12-12 04:35 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దూమాల గ్రామంలో చింత చెట్టు తొర్రలో రెండు గ్రెనేడ్ బాంబులు ప్రత్యక్షమయ్యాయి. ఈ ఘటన గురువారం వెలుగుజూసింది. వివరాళ్లోకి వెళితే.. దూమాల గ్రామానికి చెందిన మల్లేష్ అనే బాలుడు శనివారం ఉదయం వేళ చలి కాచుకోవడానికి తన ఇంటి సమీపంలో మోడువారిన చింతచెట్టు వద్ద గడ్డిని తీసుస్తుండగా చెట్టు తొర్రలో నుంచి రెండు గ్రానైట్ బాంబులు కిందపడ్డాయి. బాలుడు మొబైల్ ఫోన్‌లో తరచూ ఆడే ‘ఫ్రీ ఫైర్ గేమ్’ లో మాదిరిగా బాంబులు ఉండడంతో అనుమానించిన మల్లేష్ ఈ విషయం తన తల్లికి చెప్పాడు. గ్రెనేడ్లేనని గమనించిన మల్లేష్ తల్లి గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, దూమాల గ్రామాలు ప్రభావిత ప్రాంతాలుగా ఉండేవి, ఆ సమయంలో గ్రెనేడ్ బాంబులను నక్సల్స్ దాచి ఉండొచ్చని భావిస్తున్నారు. ఘటనకు సంబంధించిన వీడియో కింద ఉంది చూడవచ్చు.

Full View

Tags:    

Similar News