ఇన్‌స్టాలో ‘ఫోర్‌హెడ్’ ఫొటో

దిశ, వెబ్‌డెస్క్: ఇన్‌స్టా యూజర్లందరూ.. తమ ఫ్రెండ్స్‌ను, ఫాలోవర్స్‌ను ఇంప్రెస్ చేయడానికి మోస్ట్ స్టన్నింగ్ ఫొటోలను పోస్ట్ చేయడంతో పాటు ప్రొఫైల్ పిక్‌గా కూడా పెడుతుంటారు. సెలెబ్రిటీలైతే రకరకాల కాస్టూమ్స్ ట్రై చేస్తూ.. రెగ్యులర్‌గా ఫొటోషూట్స్‌ చేస్తుంటారు. అందులో నుంచి ది బెస్ట్ ఫొటోలను సెలెక్ట్ చేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఆ ఫొటోలతో ఫాలోవర్స్‌ను ఎంగేజ్ చేస్తుంటారు. అయితే, అందరికంటే భిన్నంగా.. ఓ ఇన్‌స్టా యూజర్ మాత్రం తన ‘ఫోర్ హెడ్’ ఫొటోలను షేర్ […]

Update: 2020-09-07 04:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇన్‌స్టా యూజర్లందరూ.. తమ ఫ్రెండ్స్‌ను, ఫాలోవర్స్‌ను ఇంప్రెస్ చేయడానికి మోస్ట్ స్టన్నింగ్ ఫొటోలను పోస్ట్ చేయడంతో పాటు ప్రొఫైల్ పిక్‌గా కూడా పెడుతుంటారు. సెలెబ్రిటీలైతే రకరకాల కాస్టూమ్స్ ట్రై చేస్తూ.. రెగ్యులర్‌గా ఫొటోషూట్స్‌ చేస్తుంటారు. అందులో నుంచి ది బెస్ట్ ఫొటోలను సెలెక్ట్ చేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఆ ఫొటోలతో ఫాలోవర్స్‌ను ఎంగేజ్ చేస్తుంటారు. అయితే, అందరికంటే భిన్నంగా.. ఓ ఇన్‌స్టా యూజర్ మాత్రం తన ‘ఫోర్ హెడ్’ ఫొటోలను షేర్ చేస్తున్నాడు. అందులో వింతేముందని అంటారా?.. ఇలా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఆరు సంవత్సరాల నుంచి తను ‘నుదుటి’ ఫొటోలను షేర్ చేయడం విశేషం. ఇంకో నాలుగేళ్లు.. అంటే మొత్తంగా 10 ఏళ్ల మార్క్ చేరుకునే వరకు తను ఇలానే పోస్ట్ చేస్తాడట.

గ్రీక్‌కు చెందిన 26 ఏళ్ల జార్జియస్ స్కియోచ్.. మాల్టాలో నివసిస్తున్నాడు. అయితే, అతడి ఇన్‌స్టా ‘ఫోర్‌హెడ్’ పోస్ట్‌లు ఎలా స్టార్టయ్యాయి? ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసుకోవాలంటే.. ఓ ఆరేళ్లు అలా టైమ్ ట్రావెల్ చేసి రావాల్సిందే. జార్జియస్ ప్రేయసి.. తరచుగా తను ‘ఎక్కడున్నాడో ఖచ్చితంగా తెలుసుకునేందుకు ఫొటో తీసి పంపమనేది. తప్పక.. తప్పించుకోలేక.. జార్జియస్ ఆన్ లొకేషన్ ఫొటో తీసి పంపించేవాడు. అలా ఓ సారి.. తన ముఖం కనిపించకుండా కేవలం లొకేషన్ మాత్రమే కనిపించేలా ఫోటో తీసి సెండ్ చేశాడు. తన ప్రేయసికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికింది. ఇక తన ప్రేయసి అడిగినప్పుడల్లా అదే ఫోర్ హెడ్ ఫొటోలను పంపించడం అలవాటు చేసుకున్నాడు. అదే క్రమంలో వాటిని ఇన్‌స్టాలో పోస్ట్ చేయడం ప్రారంభించాడు. పోస్టు పెట్టడంలో విఫలం కాలేదు కానీ, జార్జియస్ లవ్‌లో మాత్రం ఫెయిలయ్యాడు. అయితేనేం.. ఆ ఫోర్‌హెడ్ ఫొటోలను అలా కంటిన్యూ చేస్తున్నాడు. ప్రేయసి కోసం మొదలైన ఆ ఫొటో ఫోర్‌హెడ్ కథ.. ఆరేళ్ల నుంచి కొనసాగుతోంది. పదేళ్ల మైలురాయి వరకు ఇలానే కంటిన్యూ చేస్తానని జార్జియస్ చెబుతున్నాడు.

ఆ ‘ఫోర్ హెడ్’ ఫొటోలు జార్జియస్‌కు నచ్చాయి. ‘ఇదో గేమ్‌లా స్టార్ట్ చేశాను. కానీ రెండు వారాల తర్వాత నా దగ్గర ఫోర్ హెడ్ ఫొటోల కలెక్షన్స్ చూసుకున్నాను. అవి ఇన్‌స్టా యూజర్లకు కూడా నచ్చాయి. అంతేకాదు నా స్నేహితులు కూడా ఫొటోలు ఇలానే తీసి పోస్ట్ చేయమని కామెంట్లు వచ్చేవి’ అని తెలిపాడు జార్జియస్. దాంతో తన స్నేహితులు, తెలిసినవాళ్లు, ఆత్మీయులు.. ఇలా ఎంతోమంది ఫోర్‌హెడ్ ఫొటోలను తీస్తూ.. ఇన్‌స్టాలో షేర్ చేస్తున్నాడు.

 

Tags:    

Similar News