శభాష్ అజీం..!
దిశ, ఆదిలాబాద్: మానవత్వాన్ని మించిన గుణం మరొకటి లేదని నిర్మల్‌కు చెందిన యువ పారిశ్రామిక వేత్త ఎం.ఎ. అజీం చాటి చెప్పారు. కరోనా బాధితులకు చికిత్సనందించే వైద్యులు, సిబ్బందికి వ్యక్తిగత సంరక్షణ సామగ్రి(పీపీఈ)ల కొరత ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనకున్న నెట్ వర్క్‌తో ఈ విలువైన సామగ్రిని చెన్నై నుంచి తెప్పించారు. రూ. 2లక్షల విలువైన పీపీఈలను నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ చేతుల మీదుగా జిల్లా ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దేవేందర్‌రెడ్డికి అందజేసి […]
దిశ, ఆదిలాబాద్: మానవత్వాన్ని మించిన గుణం మరొకటి లేదని నిర్మల్‌కు చెందిన యువ పారిశ్రామిక వేత్త ఎం.ఎ. అజీం చాటి చెప్పారు. కరోనా బాధితులకు చికిత్సనందించే వైద్యులు, సిబ్బందికి వ్యక్తిగత సంరక్షణ సామగ్రి(పీపీఈ)ల కొరత ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనకున్న నెట్ వర్క్‌తో ఈ విలువైన సామగ్రిని చెన్నై నుంచి తెప్పించారు. రూ. 2లక్షల విలువైన పీపీఈలను నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ చేతుల మీదుగా జిల్లా ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దేవేందర్‌రెడ్డికి అందజేసి తన ఉదారతను చాటుకున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అత్యవసర పీపీఈలను అందజేయడం గొప్ప విషయమని అజీంను కలెక్టర్ అభినందించారు.
tags: azeem, nirmal, collector musharraf farooqi, PPE, personal protection equipment, corona, virus, doctors