మనవడే హంతకుడు.. వృద్ధురాలి హత్య కేసు చేధించిన పోలీసులు

దిశ, కామారెడ్డి : రామారెడ్డి మండలం జగదాంబ తండాలో గత నెల 24 న అర్ధరాత్రి ఆరుబయట నిద్రిస్తున్న వృద్ధురాలు బుక్యా కపూరి(71) కొడవళితో గొంతు కోసి హత్య చేసి అమెవద్ద ఉన్న నగదును ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని దుండగులు. ఈ కేసులో ప్రధానంగా వృద్ధురాలి మనవడే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ‘దిశ’ ముందే చెప్పింది. రాజుతో పాటు అతనికి సహకరించిన గంగావత్ గణేష్ ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వృద్ధురాలి హత్య కేసును […]

Update: 2021-06-03 07:01 GMT

దిశ, కామారెడ్డి : రామారెడ్డి మండలం జగదాంబ తండాలో గత నెల 24 న అర్ధరాత్రి ఆరుబయట నిద్రిస్తున్న వృద్ధురాలు బుక్యా కపూరి(71) కొడవళితో గొంతు కోసి హత్య చేసి అమెవద్ద ఉన్న నగదును ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని దుండగులు. ఈ కేసులో ప్రధానంగా వృద్ధురాలి మనవడే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ‘దిశ’ ముందే చెప్పింది. రాజుతో పాటు అతనికి సహకరించిన గంగావత్ గణేష్ ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.

వృద్ధురాలి హత్య కేసును అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. గురువారం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో ఇద్దరు యువకులు పోలీసులను చూసి పారిపోతుండగా పోలీసులు పట్టుకుని విచారించారు. పోలీసుల విచారణలో కపూరిని హత్య చేసి ఆమె వద్ద ఉన్న 42,620 రూపాయల నగదు, 20 తులాల వెండి కడియాలను ఎత్తుకెళ్లినట్టుగా ఒప్పుకున్నారని కామారెడ్డి రూరల్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Tags:    

Similar News