రఘురామ కృష్ణంరాజు పై మరో కేసు
దిశ ఏపీ బ్యూరో: పశ్చిమగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిరోజూ వార్తల్లో నిలుస్తున్న రెబల్ ఎంపీ రఘు రామకృష్ణం రాజు పై మరో ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం మంత్రి శ్రీరంగనాథరాజు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, నరసాపురం ఎంపీపై భీమవరం వన్ టౌన్ పీఎస్‌లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. తనతో పాటు తన పార్టీ సహచర ఎమ్మెల్యేలను రఘురామకృష్ణంరాజు ‘పందులు’ అంటూ అనుచితంగా వ్యాఖ్యలు […]
దిశ ఏపీ బ్యూరో: పశ్చిమగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిరోజూ వార్తల్లో నిలుస్తున్న రెబల్ ఎంపీ రఘు రామకృష్ణం రాజు పై మరో ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం మంత్రి శ్రీరంగనాథరాజు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, నరసాపురం ఎంపీపై భీమవరం వన్ టౌన్ పీఎస్‌లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు.
తనతో పాటు తన పార్టీ సహచర ఎమ్మెల్యేలను రఘురామకృష్ణంరాజు ‘పందులు’ అంటూ అనుచితంగా వ్యాఖ్యలు చేశారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పరువుకు భంగం వాటిల్లేలా వ్యాఖ్యలు చేసిన ఆయన పై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఫిర్యాదులో కోరారు. తమ పార్టీలో వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా రఘురామకృష్ణంరాజు తీరు ఉందని ఫిర్యాదులో తెలిపారు.