అక్టోబర్ 10న గ్రేస్ క్యాన్సర్ రన్
దిశ ప్రతినిధి, హైదరాబాద్: బీట్ క్యాన్సర్ బియాండ్ కోవిడ్ 19 నేపథ్యంలో రాబోయే అక్టోబర్ 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ‘‘గ్రేస్ క్యాన్సర్ రన్ (Grace Cancer Run)’’ ను నిర్వహించనున్నట్లు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ప్రకటించింది. ఈ మేరకు గురువారం సైబరాబాద్ కమిషనరేట్ లో జరిగిన కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, తెలంగాణ రాష్ట్ర మాజీ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, గ్రేస్ పౌండేషన్ చైర్మన్, మాజీ ఐజి సుజాతారావు, మాజీ మిస్ ఇండియా, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ […]
దిశ ప్రతినిధి, హైదరాబాద్: బీట్ క్యాన్సర్ బియాండ్ కోవిడ్ 19 నేపథ్యంలో రాబోయే అక్టోబర్ 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ‘‘గ్రేస్ క్యాన్సర్ రన్ (Grace Cancer Run)’’ ను నిర్వహించనున్నట్లు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ప్రకటించింది. ఈ మేరకు గురువారం సైబరాబాద్ కమిషనరేట్ లో జరిగిన కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, తెలంగాణ రాష్ట్ర మాజీ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, గ్రేస్ పౌండేషన్ చైర్మన్, మాజీ ఐజి సుజాతారావు, మాజీ మిస్ ఇండియా, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి, రేస్ డైరెక్టర్ నిరంజన్ రాజ్, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, సీఈఓ డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి తదితరులు పాల్గొని రన్ పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి టైటిల్ స్పాన్సర్ గా ‘‘రియాన్ (Ryan)’’ వ్యవహరిస్తుండగా అపోలో హాస్పిటల్స్ (apollo hospitals), హైదరాబాద్ రన్నర్స్ రన్ కు తమ వంతు సహకారం అందిస్తున్నాయి. ఈ సందర్భంగా అజయ్ మిశ్రా మాట్లాడుతూ సమాజంలోని నిరుపేదలకు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఒక ఆశా దీపంగా ఉందన్నారు. గ్రేస్ రన్ మూడు విభాగాలుగా నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు ప్రకటించారు.