పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్ సుంకం ద్వారా కేంద్రానికి రెట్టింపు ఆదాయం..

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం 2020-21 ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్, డీజిల్‌లపై విధించే ఎక్సైజ్ సుంకం ఆదాయం రెండింతలు పెరిగిందని ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరీ చెప్పారు. సమీక్షించిన కాలంలో ఈ సుంకం ఆదాయం రూ. 3.72 లక్షల కోట్లకు చేరుకుందని, ఈ మొత్తంలో రాష్ట్రాలకు రూ. 20 వేల కోట్ల కంటే తక్కువ పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. అంతకుముందు 2019-20లో ఎక్సైజ్ సుంకం నుంచి వచ్చిన ఆదాయం రూ.1.78 లక్షల కోట్లతో పోలిస్తే ఈసారి రెండింతలు […]

Update: 2021-11-30 09:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం 2020-21 ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్, డీజిల్‌లపై విధించే ఎక్సైజ్ సుంకం ఆదాయం రెండింతలు పెరిగిందని ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరీ చెప్పారు. సమీక్షించిన కాలంలో ఈ సుంకం ఆదాయం రూ. 3.72 లక్షల కోట్లకు చేరుకుందని, ఈ మొత్తంలో రాష్ట్రాలకు రూ. 20 వేల కోట్ల కంటే తక్కువ పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. అంతకుముందు 2019-20లో ఎక్సైజ్ సుంకం నుంచి వచ్చిన ఆదాయం రూ.1.78 లక్షల కోట్లతో పోలిస్తే ఈసారి రెండింతలు అయిందన్నారు. 2019లో ఎక్సైజ్ సుంకం లీటర్ పెట్రోల్‌కు రూ. 19.88 ఉండగా, డీజిల్‌పై రూ. 15.83 ఉండేది. గతేడాది సుంకాన్ని రెండుసార్లు పెంచారు. దీంతో పెట్రోల్‌పై రూ. 32.38గానూ, డీజిల్‌పై రూ. 31.83గానూ ఉంది.

ఆ తర్వాత ఈ ఏడాది బడ్జెట్ సమయంలో వీటిని పెట్రోల్‌పై రూ. 32.90, డీజిల్‌పై రూ. 31.80కి సవరించారు. ఇటీవలే వినియోగదారులపై భారం తగ్గించేందుకు లీటర్ పెట్రోల్‌పై రూ. 5, డీజిల్‌పై రూ. 10 తగ్గించారు. ఈ మార్పుతో ప్రస్తుతం లీటర్ పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం రూ. 27.90, డీజిల్‌పై రూ. 21.80 వద్ద ఉంది. 2020-21లో సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ కింద వసూలు చేసిన కార్పస్ నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించిన మొత్తం రూ. 19.972 కోట్లని పంకజ్ చౌదరీ అన్నారు.

రాష్ట్రాలకు కేవలం బేసిక్ ఎక్సైజ్ సుంకం నుంచి వచ్చే ఆదాయంలో మాత్రమే వాటా ఉంటుందని కేంద్రం పేర్కొంది. కాగా, పెట్రోల్, డీజిల్‌లపై కేంద్రానికి ఎక్సైజ్ సుంకం ద్వారా వచ్చే ఆదాయం 2016-17లో రూ. 2.2 లక్షల కోట్లు కాగా, 2017-18లో రూ. 2.25 లక్షల కోట్లు, 2018-19లో రూ. 2.13 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.

Tags:    

Similar News