మృతులకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర థానే జిల్లా భివాండీలో మూడంతస్థుల భవనం ఒక్కసారిగా కుప్పకూలి, 8 మంది స్పాట్‌లోనే మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారికోసం మంగళవారం కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. అంతేగాకుండా శిథిలాల కింద మరికొంతమంది ఉన్నట్టు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా మృతుల్లో 14 ఏళ్లలోపు బాలలు ఏడుగురిని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో సురక్షితంగా బయటపడ్డ […]

Update: 2020-09-21 22:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర థానే జిల్లా భివాండీలో మూడంతస్థుల భవనం ఒక్కసారిగా కుప్పకూలి, 8 మంది స్పాట్‌లోనే మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారికోసం మంగళవారం కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. అంతేగాకుండా శిథిలాల కింద మరికొంతమంది ఉన్నట్టు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా మృతుల్లో 14 ఏళ్లలోపు బాలలు ఏడుగురిని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో సురక్షితంగా బయటపడ్డ 20 మందిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అంతేగాకుండా ఘటనపై స్పందించిన ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఈ ఘటనకు సంబంధించి, ఇద్దరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది.

Tags:    

Similar News