ఆర్థిక వ్యవస్థను కేంద్రం నాశనం చేస్తున్నది: రాహుల్

న్యూఢిల్లీ: మనదేశ ఆర్థిక వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం నాశనం చేస్తున్నదని రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రజలకు, ఎంఎస్‌ఎంఈలకు ఆర్థిక సహాయాన్ని అందించకుండా ఈ పనికి పూనుకున్నదని ఆరోపణలు సంధించారు. అంతేకాదు, రెండో సారి అధికారాన్ని చేపట్టిన మోడీ 2.0 సర్కారును రాక్షస రాజ్యం 2.0గా వర్ణించారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే వెంటనే పేదలకు రూ. 10వేలను, ఎంఎస్ఎంఈలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని విడుదల చేయాలని సూచించారు. పెద్దమొత్తంలో ఉపాధినిస్తున్న ఎంఎస్ఎంఈలకు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని తొలి […]

Update: 2020-06-06 09:05 GMT

న్యూఢిల్లీ: మనదేశ ఆర్థిక వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం నాశనం చేస్తున్నదని రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రజలకు, ఎంఎస్‌ఎంఈలకు ఆర్థిక సహాయాన్ని అందించకుండా ఈ పనికి పూనుకున్నదని ఆరోపణలు సంధించారు. అంతేకాదు, రెండో సారి అధికారాన్ని చేపట్టిన మోడీ 2.0 సర్కారును రాక్షస రాజ్యం 2.0గా వర్ణించారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే వెంటనే పేదలకు రూ. 10వేలను, ఎంఎస్ఎంఈలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని విడుదల చేయాలని సూచించారు. పెద్దమొత్తంలో ఉపాధినిస్తున్న ఎంఎస్ఎంఈలకు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని తొలి నుంచీ కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నది. మార్కెట్‌లో డిమాండ్ ఏర్పడాలంటే దీనితో పాటు ప్రజలకు దగ్గర నగదు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పుకొస్తున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News