మూడేళ్ల అజ్ఞాతం తర్వాత ప్రజల్లోకొచ్చారు

కోల్‌కతా: మూడేళ్ల అజ్ఞాతం తర్వాత గోర్ఖా జనముక్తి మోర్చా(జీజేఎం) లీడర్ బిమర్ గురుంగ్ బుధవారం ప్రత్యక్షమయ్యారు. కోల్‌కతా సాల్ట్‌లేక్‌లోని గోర్ఖా భవన్‌‌లో విలేకరుల సమావేశంలో ఎన్‌డీఏతో తెగదెంపులు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. గోర్ఖాలాండ్ ఏర్పాటు చేస్తామన్న హామీని బీజేపీ నిలుపుకోలేదని పేర్కొంటూ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. వచ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి మద్దతునివ్వనున్నట్టు తెలిపారు. గోర్ఖాలాండ్ డిమాండ్‌కు కట్టుబడే ఉన్నారని, తమ డిమాండ్‌ను ముందుకు తీసుకెళ్లే పార్టీకి మద్దతునిస్తామని అన్నారు. 2017లో ఉపా కేసు నమోదైనప్పటి […]

Update: 2020-10-21 12:12 GMT

కోల్‌కతా: మూడేళ్ల అజ్ఞాతం తర్వాత గోర్ఖా జనముక్తి మోర్చా(జీజేఎం) లీడర్ బిమర్ గురుంగ్ బుధవారం ప్రత్యక్షమయ్యారు. కోల్‌కతా సాల్ట్‌లేక్‌లోని గోర్ఖా భవన్‌‌లో విలేకరుల సమావేశంలో ఎన్‌డీఏతో తెగదెంపులు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. గోర్ఖాలాండ్ ఏర్పాటు చేస్తామన్న హామీని బీజేపీ నిలుపుకోలేదని పేర్కొంటూ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. వచ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి మద్దతునివ్వనున్నట్టు తెలిపారు. గోర్ఖాలాండ్ డిమాండ్‌కు కట్టుబడే ఉన్నారని, తమ డిమాండ్‌ను ముందుకు తీసుకెళ్లే పార్టీకి మద్దతునిస్తామని అన్నారు. 2017లో ఉపా కేసు నమోదైనప్పటి నుంచి గురుంగ్ అజ్ఞాతంలోకి వెళ్లారు.

Tags:    

Similar News