'క్రాక్' సెట్‌లో డైరెక్టర్ బర్త్ డే సెలబ్రేషన్స్

దిశ, వెబ్‌డెస్క్: మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా ‘క్రాక్’. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్‌పై బి.మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘డాన్ శీను’, ‘బలుపు’ చిత్రాల తర్వాత రవితేజ, గోపీచంద్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంలో రవితేజ పోలీసాఫీసర్‌గా కనిపించబోతున్నారు. మే 8న ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. కాగా ‘క్రాక్’ సెట్‌లో డైరెక్టర్ గోపీచంద్ మలినేని పుట్టినరోజు […]

Update: 2020-03-13 07:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా ‘క్రాక్’. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్‌పై బి.మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘డాన్ శీను’, ‘బలుపు’ చిత్రాల తర్వాత రవితేజ, గోపీచంద్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంలో రవితేజ పోలీసాఫీసర్‌గా కనిపించబోతున్నారు. మే 8న ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

కాగా ‘క్రాక్’ సెట్‌లో డైరెక్టర్ గోపీచంద్ మలినేని పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించింది మూవీ యూనిట్. సముతిరఖని, రవిశంకర్‌తో పాటు టెక్నిషియన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేయించారు. సోషల్ మీడియాలోనూ గోపీచంద్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్న ‘క్రాక్’ సినిమాకు ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Tags: Krack, Gopichand Malineni, HBD Gopichand Malineni, Krack OnMay8th, RaviTeja, Shruthi Hassan, Vara Laxmi Sharath Kumar

Tags:    

Similar News