రెట్టింపైన రోగ నిరోధకత పెంచే ఆహార పదార్థాల కొనుగోళ్లు!

దిశ, సెంట్రల్ డెస్క్: కరోనా వైరస్ ప్రజలకు భయంతో పాటు ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా పెంచింది. వైరస్ వ్యాప్తి పెరిగినప్పటి నుంచి వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రజలు ఎక్కువగా రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారా పదార్థాలను కొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని గూగుల్ నివేదిక చెబుతోంది. రోజూ తీసుకునే ఆహారంలో ఇమ్యూనిటీ పవర్ ఉండే వాటిని జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నారని ఈ నివేదిక తెలిపింది. ముఖ్యంగా విటమిన్ సి ఉండే ఆహార పదార్థాలను ఎక్కువమంది […]

Update: 2020-05-26 09:04 GMT

దిశ, సెంట్రల్ డెస్క్: కరోనా వైరస్ ప్రజలకు భయంతో పాటు ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా పెంచింది. వైరస్ వ్యాప్తి పెరిగినప్పటి నుంచి వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రజలు ఎక్కువగా రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారా పదార్థాలను కొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని గూగుల్ నివేదిక చెబుతోంది. రోజూ తీసుకునే ఆహారంలో ఇమ్యూనిటీ పవర్ ఉండే వాటిని జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నారని ఈ నివేదిక తెలిపింది. ముఖ్యంగా విటమిన్ సి ఉండే ఆహార పదార్థాలను ఎక్కువమంది గూగుల్‌లో సెర్చ్ చేశారని నివేదిక పేర్కొంది. ఇండియాలో వీటి అమ్మకాలు సుమారు 40 శాతం పెరిగాయని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.

గూగుల్ చేసిన ఈ సర్వేలో.. వంటింటి చిట్కాలు, ఆయుర్వేద, విటమిస్ సీ పదార్థాల గురించి ఆన్‌లైన్‌లో వెతికే వారి సంఖ్య 6 రెట్లు పెరిగింది. ఈ పెరుగుదల ఆయుర్వేద ఉత్పత్తులను విక్రయించే డాబర్ లాంటి కంపెనీలకు కలిసొస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అలాగే, విప్రో, మారికో లాంటి కంపెనీలకు కూడా లబ్ధి ఉంటుందన్నారు. చవన్‌ప్రాశ్‌, హెల్త్‌బార్స్‌, పలు బ్రాండెడ్‌ హెల్త్‌ సాల్ట్‌ల కొనుగోళ్లు రెట్టింపు అయ్యాయని స్పెన్సర్స్‌ రిటైల్‌ అండ్‌ నేచర్స్‌ బాస్కెట్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్ దేవేంద్ర చావ్లా చెప్పారు. ఆరోగ్య ఉత్పత్తులు, వ్యక్తిగత పరిశుభ్రత కలిగిన ఉత్పత్తులపై ప్రజలు అధికంగా సొమ్ము వెచ్చిస్తున్నారని, 56 శాతం మంది వినియోగదారులు దీనికి మద్దతు తెలిపారని ప్రముఖ కన్సల్టెన్సీ నీల్సన్ ఓ సర్వేలో తేల్చింది. అంతేగాకుండా, కరోనా తర్వాత డిమాండ్ పెరిగిన శానిటైజర్, ఫ్లోర్ క్లీనర్ వంటి వాటిని తయారు చేసే కంపెనీల సంఖ్య కూడా భారీగా పెరిగాయని గూగుల్ సర్వేలో తేలింది. దాదాపు 152 కొత్త కంపెనీలు ఈ రంగంలోకి వచ్చాయని తెలుస్తోంది.

Tags:    

Similar News