నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ భర్తీ చేసింది. రెగ్యులర్ ప్రతిపదికన ఈ ఉద్యోగాలకు భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ విభాగంలో ఈ నియామకాలను చేపట్టారు. మొత్తం 453 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల […]

Update: 2021-06-16 07:18 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ భర్తీ చేసింది. రెగ్యులర్ ప్రతిపదికన ఈ ఉద్యోగాలకు భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ విభాగంలో ఈ నియామకాలను చేపట్టారు. మొత్తం 453 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

ఖాళీల వివరాలు
1. గైనకాలజీ విభాగంలో 269 ఖాళీలు ఉన్నాయి. 2.పీడియాట్రిక్స్ – 11
3.అనెస్తీషియా – 64
4. జనరల్ మెడిసిన్ – 30
5. జనరల్ సర్జన్ – 16
6. ఆర్థోపెడిక్స్ – 12
7. పాథాలజీ – 05
8. ఆప్తాల్మాలజీ – 09
9. రేడియాలజీ – 21
10. సైకియాట్రీ – 02
11. డెర్మటాలజీ – 06
12. ఈఎన్టీ(ENT) – 08

పైన పేర్కొన్న సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ లేదా డిప్లోమా డీఎన్‌బీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ఏపీ స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. అభ్యర్థుల వయస్సు జూలై 1 నాటికి 42 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు వయో పరిమితిలో మూడేళ్ల సడలింపు ఇచ్చారు. దరఖాస్తు చేసే సమయంలో అభ్యర్థులు రూ. 1500లను పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 1000 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజును ఏదైనా జాతీయ బ్యాంకులో ‘THE COMMISSIONER, AP VAIDYA VIDHANA PARISHAD’ పేరు మీద డీడీ తీసి పంపించాల్సి ఉంటుంది. డీడీని ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5: 30 గంటలలోగా O/o.Commissioner, APVVP, 4th Floor, B-Block, Himagna Towers, Old NRI college buildings, Gollapudi, Vijayawada Rural, Krishna District, Andhra Pradesh-521225 చిరునామాకు చేరేలా పంపించాల్సి ఉంటుంది. అలాగే అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://dmeaponline.com/ వెబ్ సైట్‌లో ఈ నెల 28లోగా అప్లై చేయాలని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. అప్లికేషన్ సమయంలో కావాల్సిన ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను నోటిఫికేషన్‌లో చూడొచ్చు. అకాడమిక్ మెరిట్, గతంలో పని చేసిన అనుభవం ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 53,500 వరకు వేతనం చెల్లించనున్నారు. మూడేళ్ల ప్రొహిబిషన్ పిరియడ్ అనంతరం వేతన పెంపు ఉంటుంది.

Tags:    

Similar News