ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం జగన్.. వారిలో కొత్త ఆశలు
దిశ, ఏపీ బ్యూరో : సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ఉద్యోగులకు ఊరటనిచ్చేలా కీలక ప్రకటన చేశారు. ఉద్యోగులు చిరకాలంగా ఎదురు చూస్తున్న 11వ పీఆర్సీపై స్పష్టత ఇచ్చారు. తిరుపతి పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రిని ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలకు సీఎం జగన్ కీలక హామీ ఇచ్చారు. పది రోజుల్లో పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. పీఆర్సీపై మూడు ప్రధాన ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంపై కొంతకాలంగా ఒత్తిడి తెస్తున్నారు. అయితే, […]
దిశ, ఏపీ బ్యూరో : సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ఉద్యోగులకు ఊరటనిచ్చేలా కీలక ప్రకటన చేశారు. ఉద్యోగులు చిరకాలంగా ఎదురు చూస్తున్న 11వ పీఆర్సీపై స్పష్టత ఇచ్చారు. తిరుపతి పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రిని ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలకు సీఎం జగన్ కీలక హామీ ఇచ్చారు. పది రోజుల్లో పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. పీఆర్సీపై మూడు ప్రధాన ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంపై కొంతకాలంగా ఒత్తిడి తెస్తున్నారు.
అయితే, అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు దానికనుగుణంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 27 శాతం మధ్యంతర భృతి ఇస్తున్న రాష్ట్ర సర్కారు 30 నుంచి 35 శాతం మధ్యలో పీఆర్సీని ఇస్తుందని లీకులు వస్తున్నాయి. ఉద్యోగ సంఘాలు మాత్రం పెరిగిన ఖర్చుల దృష్ట్యా కనీసం 50 శాతం పీఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా దీనిపై నియమించిన కమిటీ నివేదికను మాత్రం ఇప్పటి వరకు ప్రభుత్వం బహిర్గతం చేయడం లేదు. మెుత్తానికి 10 రోజుల్లో పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటానని సీఎం హామీతో ఉద్యోగుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.