జూన్ 8న రాష్ట్రంలోకి రుతుపవనాల రాక

హైదరాబాద్: కరోనాతో కుదేలవుతున్న రైతాంగానికి వాతావరణశాఖ చల్లటి కబురు చెప్పింది. ఈ ఏడాది జూన్ 8నే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వెల్లడించింది. గతేడాది జూన్ 23న ప్రవేశించిన నైరుతి రుతుపనాలు.. ఈసారి ముందుగానే వస్తుండటం విశేషం. ఈ మేరకు దేశంలోకి నైరుతి రుతుపవనాల రాకకు సంబంధించిన తేదీలను ఐఎండీ విడుదల చేసింది. ఇవి జూన్ 1న కేరళను తాకనుండగా, 8న తెలంగాణలోకి ప్రవేశించనున్నాయి. అయితే, ఈ ఏడాది కూడా సాధారణ వర్షపాతమే ఉంటుందని వాతావరణ శాఖ […]

Update: 2020-04-15 20:29 GMT

హైదరాబాద్: కరోనాతో కుదేలవుతున్న రైతాంగానికి వాతావరణశాఖ చల్లటి కబురు చెప్పింది. ఈ ఏడాది జూన్ 8నే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వెల్లడించింది. గతేడాది జూన్ 23న ప్రవేశించిన నైరుతి రుతుపనాలు.. ఈసారి ముందుగానే వస్తుండటం విశేషం. ఈ మేరకు దేశంలోకి నైరుతి రుతుపవనాల రాకకు సంబంధించిన తేదీలను ఐఎండీ విడుదల చేసింది. ఇవి జూన్ 1న కేరళను తాకనుండగా, 8న తెలంగాణలోకి ప్రవేశించనున్నాయి. అయితే, ఈ ఏడాది కూడా సాధారణ వర్షపాతమే ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాగా, దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్ జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది.

Tags: southwest Monsoon, kerala, telangana, june

Tags:    

Similar News