పర్యాటక ప్రియులకు గుడ్ న్యూస్.. రేపు ఎంట్రీ ఫ్రీ
దిశ, డైనమిక్ బ్యూరో: ఉరుకుల పరుగుల జీవితంలో కాస్త ఉపశమనం పొందేందుకు ఔటింగ్ వెళ్లడానికి ప్రజలు ఇష్టపడుతుంటారు. పురాతన కట్టడాలను సందర్శించి వాటి విశేషాలను తెలుసుకోవాలని ఉత్సాహం వ్యక్తం చేస్తుంటారు. మరికొందరు మ్యూజియం, మరికొందరు సినిమాలు, పార్కులు అంటూ పబ్లిక్ ఉండే ప్రదేశానికి వెళ్లి పిల్లలతో సందడిగా గడుపుతుంటారు. అయితే, ప్రస్తుతం ఎక్కడైనా ఎంట్రీ ఫీజులు ఉండటం చూస్తుంటాం. అయితే, పర్యాటకుల వద్ద ఎలాంటి ఎంట్రీ ఫీజు తీసుకోకుండా అనుమతించేందుకు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది. […]
దిశ, డైనమిక్ బ్యూరో: ఉరుకుల పరుగుల జీవితంలో కాస్త ఉపశమనం పొందేందుకు ఔటింగ్ వెళ్లడానికి ప్రజలు ఇష్టపడుతుంటారు. పురాతన కట్టడాలను సందర్శించి వాటి విశేషాలను తెలుసుకోవాలని ఉత్సాహం వ్యక్తం చేస్తుంటారు. మరికొందరు మ్యూజియం, మరికొందరు సినిమాలు, పార్కులు అంటూ పబ్లిక్ ఉండే ప్రదేశానికి వెళ్లి పిల్లలతో సందడిగా గడుపుతుంటారు. అయితే, ప్రస్తుతం ఎక్కడైనా ఎంట్రీ ఫీజులు ఉండటం చూస్తుంటాం. అయితే, పర్యాటకుల వద్ద ఎలాంటి ఎంట్రీ ఫీజు తీసుకోకుండా అనుమతించేందుకు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది. ప్రపంచ వారసత్వ వారోత్సవాల్లో భాగంగా ఈనెల 19న శుక్రవారం దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర పరిధిలోని రక్షిత స్మారక చిహ్నాలు, స్థలాల్లో ఎలాంటి ఫీజు తీసుకోవద్దని నిర్ణయించారు. ఈ మేరకు గురవారం ప్రకటన విడుదల చేశారు.
Free entry for all in ASI Protected Monuments/sites on 19th November 2021 on the commencement of the #WorldHeritageWeekCelebrations. pic.twitter.com/hXUufKnRsS
— Archaeological Survey of India (@ASIGoI) November 18, 2021