ఏపీ సర్కార్‌కు గుడ్ న్యూస్.. ఆ అభ్యర్థనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
దిశ, ఏపీ బ్యూరో : ఏపీ ప్రభుత్వం రుణ పరిమితి పెంపు కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అప్పు చేసుకునేందుకు కేంద్రం ఆర్థిక వ్యయ విభాగం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా ఆర్థిక శాఖ అధికారులు పదే పదే ఢిల్లీ వెళ్లి రుణ పరిమితి పెంపు కోసం ప్రయత్నాలు చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగం […]
దిశ, ఏపీ బ్యూరో : ఏపీ ప్రభుత్వం రుణ పరిమితి పెంపు కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అప్పు చేసుకునేందుకు కేంద్రం ఆర్థిక వ్యయ విభాగం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా ఆర్థిక శాఖ అధికారులు పదే పదే ఢిల్లీ వెళ్లి రుణ పరిమితి పెంపు కోసం ప్రయత్నాలు చేశారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగం అధికారులతో పదే పదే భేటీ అయ్యారు. అయితే, ఏపీ ప్రభుత్వం రుణ పరిమితి పెంపు అభ్యర్థనకు కేంద్రం ఆమోదం తెలిపింది. మరో రూ.10,500 కోట్ల రుణానికి కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగం అనుమతిచ్చింది. ఈ సమాచారాన్ని కేంద్రం రిజర్వు బ్యాంకుకు పంపించింది.