బంగారం సరికొత్త రికార్డ్
దిశ, వెబ్‌డెస్క్: బంగారం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. అడ్డూఅదుపు లేకుండా దూసుకెళ్తోంది. బుధవారం సైతం బంగారం భగ్గుమంది. సరికొత్త రికార్డులతో పరుగులు తీస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం పెరగడంతో ఆ ప్రభావం దేశీయ మల్టీకమొడిటీ మార్కెలోనూ పడింది. ఈ నేపథ్యంలోనే దేశీయంగా బంగారం ధరలు పెరిగాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బుధవారం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు రూ. 1,010 పెరిగి రూ. 57,820కి చేరుకుంది. ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి. అదే […]
దిశ, వెబ్‌డెస్క్: బంగారం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. అడ్డూఅదుపు లేకుండా దూసుకెళ్తోంది. బుధవారం సైతం బంగారం భగ్గుమంది. సరికొత్త రికార్డులతో పరుగులు తీస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం పెరగడంతో ఆ ప్రభావం దేశీయ మల్టీకమొడిటీ మార్కెలోనూ పడింది. ఈ నేపథ్యంలోనే దేశీయంగా బంగారం ధరలు పెరిగాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
బుధవారం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు రూ. 1,010 పెరిగి రూ. 57,820కి చేరుకుంది. ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ. 930 పెరిగి రూ. 53,010 వద్ద ఉంది. వెండి సైతం బంగారం బాటలో దూసుకెళ్తోంది.
వెండి కిలో ఒక్కరోజే రూ. 6,450 పెరిగడంతో బుధవారం వెండి కిలో రూ. 71,500కు చేరుకుంది. మునుపటితో పోలిస్తే వెండి కాస్త నిలకడగా ఉన్నప్పటికీ, బంగారం మాత్రం భారీగా పెరుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే…24 క్యారెట్ల పది గ్రాముల బంగారం చెన్నైలో రూ. 57,820 ఉండగా, ముంబైలో రూ. 54,400, ఢిల్లీలో రూ. 54,700, కోల్‌కతా రూ. 53,900, బెంగళూరు రూ. 56,500గా ఉంది.