బంగారం..నెమ్మదిగా!
దిశ, వెబ్‌డెస్క్ : అంతర్జాతీయంగా కరోనా విస్తరిస్తుండం ఒకవైపు భయాన్ని పెంచుతుంటే, మరోవైపు దేశీయంగా రూపాయి మారకం విలువ బలహీన పడటం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలకు రెక్కలు వచ్చేశాయి. మన దేశంలోనూ కరోనా కేసులు పెరుగుతుండటం ఇది మరింత ఆందోళనను పెంచింది. మదుపర్లు పెట్టుబడులకు బంగారాన్నే సులభ మార్గమని భావిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు అనిశ్చితిని కొనసాగిస్తుండటంతో ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా బంగారం నిలకడగా రూ. 43,000 […]
దిశ, వెబ్‌డెస్క్ : అంతర్జాతీయంగా కరోనా విస్తరిస్తుండం ఒకవైపు భయాన్ని పెంచుతుంటే, మరోవైపు దేశీయంగా రూపాయి మారకం విలువ బలహీన పడటం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలకు రెక్కలు వచ్చేశాయి. మన దేశంలోనూ కరోనా కేసులు పెరుగుతుండటం ఇది మరింత ఆందోళనను పెంచింది. మదుపర్లు పెట్టుబడులకు బంగారాన్నే సులభ మార్గమని భావిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు అనిశ్చితిని కొనసాగిస్తుండటంతో ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా బంగారం నిలకడగా రూ. 43,000 వద్దకు చేరింది. మల్టీ కమోడిటీ మార్కెట్లో బుధవారం కంటే గురువారం పది గ్రాముల బంగారం రూ. 50 తగ్గి రూ. 43,422 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 2 డాలర్లు తగ్గి 1,640 వద్ద ట్రేడవుతోంది.
tags : MCX Gold Crosses Above Rs 43, 000, Coronavirus Worries, Gold Price Gains Momentum, Coronavirus Outbreak, Yellow Metal, Retail Market,