బురద కుంటకు ఎక్కువ.. ప్రధాన రహదారికి తక్కువ

దిశ, గోదావరిఖని : గోదావరిఖని బస్టాండ్ ప్రధాన రహదారి గత కొన్ని రోజులుగా బురద కుంటగా మారినా పట్టించుకునే వారు కరువయ్యారు. గతంలో ఇదే రోడ్డుపై ఎన్నో ప్రమాదాలు జరిగినా అధికారుల్లో మాత్రం నేటికి చలనం రావడం లేదంటూ వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వాహనాలు తిరిగే ప్రదేశం కావడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. చిన్నచిన్న వర్షాలకు ఈ రోడ్డు నీటి కుంటగా మారుతోంది. అయినా ఇప్పటివరకు అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. […]

Update: 2021-09-11 09:36 GMT

దిశ, గోదావరిఖని : గోదావరిఖని బస్టాండ్ ప్రధాన రహదారి గత కొన్ని రోజులుగా బురద కుంటగా మారినా పట్టించుకునే వారు కరువయ్యారు. గతంలో ఇదే రోడ్డుపై ఎన్నో ప్రమాదాలు జరిగినా అధికారుల్లో మాత్రం నేటికి చలనం రావడం లేదంటూ వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వాహనాలు తిరిగే ప్రదేశం కావడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. చిన్నచిన్న వర్షాలకు ఈ రోడ్డు నీటి కుంటగా మారుతోంది. అయినా ఇప్పటివరకు అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. గతంలో ఇదే రోడ్డుపై వెళ్తున్న క్రమంలో ఎంతోమంది ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి కిందపడి గాయాలపాలైన ఘటనలు అనేకం ఉన్నాయి. ఇప్పటికైనా ఈ రోడ్డుకు మరమ్మతులు చేయించాలని పలువురు వాహనదారులు, బాధితులు కోరుతున్నారు.

Tags:    

Similar News