భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం
దిశ ప్రతినిధి, ఖమ్మం: గోద్రావరి భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చుతోంది. 53 అడుగులకు చేరువలో ఉండటంతో మూడో హెచ్చరిక జారీ చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. 52.8 అడుగుల మేర ప్రస్తుతం ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 13.75 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. ఆదివారం ఉదయం నుంచి క్రమంగా పెరుగుతూ వస్తుండటం గమనార్హం. ఆదివారం ఉదయం 9 గంటలకు 50 అడుగులు దాటింది. 48 అడుగుల దాటడంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ […]
దిశ ప్రతినిధి, ఖమ్మం: గోద్రావరి భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చుతోంది. 53 అడుగులకు చేరువలో ఉండటంతో మూడో హెచ్చరిక జారీ చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. 52.8 అడుగుల మేర ప్రస్తుతం ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 13.75 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. ఆదివారం ఉదయం నుంచి క్రమంగా పెరుగుతూ వస్తుండటం గమనార్హం.
ఆదివారం ఉదయం 9 గంటలకు 50 అడుగులు దాటింది. 48 అడుగుల దాటడంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 53 అడుగులు చేరుకుంటే మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. ఆదివారం ఉదయం నుంచి ఇంద్రావతి వరద నీరు జత కలవడంతో గోదావరి ప్రవాహం పెరిగింది. మేడిగడ్డ నుంచి వచ్చే వరద సాయంత్రం నాటికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పేరూరు, ఏటూరునాగారం, దుమ్ముగూడెం, భద్రాచలం వద్ద గోదావరి ఉధృతిలో ఉంది. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల్లోగా గోదావరి 53 అడుగులు దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.