గోవాలో.. లిక్విడ్ ప్రూఫ్ పేపర్ బ్యాగ్స్
దిశ, వెబ్‌డెస్క్: కూరగాయాల నుంచి మొదలుపెడితే.. మందు బాటిళ్ల వరకు అన్నిటికీ ప్లాస్టిక్ కవర్స్ వాడకం అలవాటుగా మారింది. ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడొద్దంటూ ప్రభుత్వం సూచిస్తున్నా, షాపుల యజమానులకు జరిమానాలు విధిస్తున్నా.. చల్తా హై అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే పర్యావరణ ప్రేమికుడు సచిన్ గంగాధరన్ ప్లాస్టిక్ బ్యాగ్స్‌కు బదులుగా ‘బయో డిగ్రెడబుల్ బ్యాగ్స్’ను రూపొందిస్తున్నాడు. ‘లిక్విడ్ మెటీరియల్’ లీక్ కాకుండా ఈ బ్యాగ్స్‌ను రూపొందించడం విశేషం. ఇరవైకి పైగా బీచ్‌లు, చారిత్రక ప్రదేశాలున్న ‘గోవా’కు సందర్శకుల […]
దిశ, వెబ్‌డెస్క్: కూరగాయాల నుంచి మొదలుపెడితే.. మందు బాటిళ్ల వరకు అన్నిటికీ ప్లాస్టిక్ కవర్స్ వాడకం అలవాటుగా మారింది. ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడొద్దంటూ ప్రభుత్వం సూచిస్తున్నా, షాపుల యజమానులకు జరిమానాలు విధిస్తున్నా.. చల్తా హై అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే పర్యావరణ ప్రేమికుడు సచిన్ గంగాధరన్ ప్లాస్టిక్ బ్యాగ్స్‌కు బదులుగా ‘బయో డిగ్రెడబుల్ బ్యాగ్స్’ను రూపొందిస్తున్నాడు. ‘లిక్విడ్ మెటీరియల్’ లీక్ కాకుండా ఈ బ్యాగ్స్‌ను రూపొందించడం విశేషం.
ఇరవైకి పైగా బీచ్‌లు, చారిత్రక ప్రదేశాలున్న ‘గోవా’కు సందర్శకుల తాకిడి ఎప్పుడూ ఉంటుంది. అంతేకాదు గోవాకున్న మరో ప్రత్యేకత ఏంటంటే.. మిగతా ప్రదేశాలతో పోల్చితే అక్కడ ‘లిక్కర్’ విలువ కాస్త తక్కువగా ఉండటంతో ప్రతిరోజు లక్షల సంఖ్యలో లిక్కర్ బాటిల్స్ అమ్ముడుపోతుంటాయి. ఈ క్రమంలో చీప్ లిక్కర్ నుంచి ఖరీదైన స్కాచ్ వరకు మందు బాటిళ్లను క్యారీ చేసేందుకు ప్లాస్టిక్ కవర్స్‌నే వాడుతుంటారు. అది గమనించిన సచిన్.. వాటికి చెక్ పెట్టేందుకు రీసైకిల్డ్ పేపర్ పల్ప్ నుంచి ‘బయోడిగ్రెడబుల్ బ్యాగ్స్’ రూపొందించాడు. పాలీ లాక్టిక్ యాసిడ్ లేయర్‌తో వీటిని రూపొందించడం వల్ల ఏ లిక్విడ్స్ కూడా ఇందులోంచి లీక్ కావు. ‘లా ఫ్యాబ్రికా క్రాఫ్ట్’ పేరుతో మార్కెట్లో విడుదల చేసిన ఈ బ్యాగులు 20కిలోల వరకు బరువును, గరిష్ఠంగా 46 గంటల వరకు ద్రవ పదార్థాల లీకేజ్‌ను ఆపగలవు. ఈ పేపర్ బ్యాగ్స్ ఉపయోగించిన తర్వాత అవసరం లేదనుకుంటే ఆ బ్యాగ్స్ డిగ్రెడబుల్ కావడంతో కంపోస్ట్‌గానూ వాడుకోవచ్చు. రాబోయే రోజుల్లో పాలీ లాక్టిక్ యాసిడ్ బదులుగా కార్న్ స్టార్చ్, బగస్సేల మిశ్రమాన్ని ఇందుకు ఉపయోగించేందుకు సచిన్ ప్రయత్నాలు చేస్తున్నాడు.