ఆ మ్యూజియంలో భద్రపరచిన ‘ఆల్కహాల్’చరిత్ర!
దిశ, ఫీచర్స్: ఇండియాలో చాలామంది యూత్‌ను, కొత్తగా పెళ్లైన జంటలను ఆకట్టుకునే పర్యాటక ప్రదేశం గోవా.. పార్టీ క్యాపిటల్‌గా పేరొందిన ‘గోవా’లో ఎటు చూసినా కనువిందు చేసే బీచ్‌లతోపాటు.. ఎన్నో చూడదగ్గ ప్రదేశాలకు నిలయంగా చెప్పవచ్చు. అయితే వీటన్నింటితోపాటు ప్రస్తుతం గోవా విజిటింగ్ ప్లేస్‌లో ‘ఆల్కహాల్ మ్యూజియం’ కూడా చేరిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురాతన గాజుసామాను నుండి, దాని స్వంత గోవాన్-శైలి టావెర్న్ వరకు ఎన్నో విభిన్న ఆల్కహాల్ బాటిల్స్ ‘ఆల్ అబౌట్ ఆల్కహాల్’ మ్యూజియంలో కొలువుదీరాయి. […]
దిశ, ఫీచర్స్: ఇండియాలో చాలామంది యూత్‌ను, కొత్తగా పెళ్లైన జంటలను ఆకట్టుకునే పర్యాటక ప్రదేశం గోవా.. పార్టీ క్యాపిటల్‌గా పేరొందిన ‘గోవా’లో ఎటు చూసినా కనువిందు చేసే బీచ్‌లతోపాటు.. ఎన్నో చూడదగ్గ ప్రదేశాలకు నిలయంగా చెప్పవచ్చు. అయితే వీటన్నింటితోపాటు ప్రస్తుతం గోవా విజిటింగ్ ప్లేస్‌లో ‘ఆల్కహాల్ మ్యూజియం’ కూడా చేరిపోయింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురాతన గాజుసామాను నుండి, దాని స్వంత గోవాన్-శైలి టావెర్న్ వరకు ఎన్నో విభిన్న ఆల్కహాల్ బాటిల్స్ ‘ఆల్ అబౌట్ ఆల్కహాల్’ మ్యూజియంలో కొలువుదీరాయి. బీచ్ గ్రామమైన కండోలిమ్‌లో ఉన్న ఈ మ్యూజియం 13,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. గోవా స్పెషల్ అండ్ స్వదేశీ డ్రింక్ ‘ఫెని’ చరిత్రను కూడా అక్కడ తెలుసుకోవచ్చు. వ్యాపారవేత్త, కలెక్టర్ నందన్ కుడ్చడ్కర్ ఈ మ్యూజియాన్ని స్థాపించాడు.
‘పులియబెట్టిన జీడిపప్పు, ఆపిల్స్ నుంచి స్వేదనం చేసిన ‘ఫెని’ శతాబ్దాలుగా ఎలా ఉత్పత్తి చేశారు? ఎలా ప్రసిద్ధి పొందింది? అనే వివరాలు పర్యాటకులు తెలుసుకోవచ్చు. వేలాది బహుళ వర్ణ గారెఫీల(పెద్ద బొడ్డు గల గాజు సీసాలు)ను ఇక్కడ చూడొచ్చు. సందర్శకులు కొన్ని క్రాఫ్ట్ ఫెని కాక్‌టెయిల్‌లను శాంపిల్ చేయవచ్చు. చాలా మంది సందర్శకులు దాని వాసన తమకు నచ్చలేదని చెబుతుండటంతో నెలల తరబడి ప్రయత్నించి ‘ఫెని కాక్టెయిల్’ ను రూపొందించాం. రష్యా నుంచి సేకరించిన అరుదైన క్రిస్టల్ ఆస్ట్రేలియన్ బీర్ హార్న్, పురాతన వుడ్‌షాట్ డిస్పెన్సర్, మట్టి కుండలు, బీకర్లు, 16 వ శతాబ్దంలో కొలిచే పరికరాలు సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆల్కహాల్ బాటిల్స్ చూడొచ్చు. ఆల్కహాల్ చరిత్ర, సంస్కృతిని అర్థం చేసుకోవడానికి, దానిని గోవా ప్రాంతంతో ముడి పెట్టేందుకు ఏడాదికి పైగా దీనిపై పరిశోధన సాగించాను. మొత్తానికి ఆగస్టు 13న మ్యూజియాన్ని ప్రారంభించాను. గోవాలో ‘మద్యపాన కల్చర్’ను ప్రజలు అర్థం చేసుకునే విధానాన్ని మార్చడానికే నా ప్రయత్నం. రాబోయే రోజుల్లో మ్యూజియాన్ని మరింత విస్తరిస్తున్నాను.
– నందన్ కుడ్చడ్కర్