అక్కడ విద్యార్థినులకు డిగ్రీతోపాటు పాస్‌పోర్టులు
ఛండీగడ్: హర్యానా సీఎం మనోహర్ లాల్ సంచలన ప్రకటన చేశారు. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థినులకు పాస్‌పోర్టులు అందిస్తామని వెల్లడించారు. ఆ పాస్‌పోర్టు ప్రక్రియ అంతా వారు చదువుతున్న కాలేజీల్లోనే పూర్తిచేస్తామని వివరించారు. 18 నుంచి 25 ఏళ్ల వయసున్న స్కూల్, కాలేజీ, ఐటీఐ విద్యార్థులకు హెల్మెట్లు, లెర్నింగ్ లైసెన్స్‌లు అందజేసే కార్యక్రమంలో పాల్గొన్న సీఎం తరగతి గదుల్లో పాఠాలతోపాటు ట్రాఫిక్ నిబంధనలూ బోధించాలని, లైసెన్స్‌లూ విద్యాసంస్థల ద్వారానే అందజేయాలని అన్నారు.