ప్రియురాలి పెళ్లి చెడగొట్టి ముఖం చాటేసిన కన్నింగ్ ప్రియుడు.. బాధితురాలు ఏం చేసిందంటే..?

దిశ, సుల్తానాబాద్ : ప్రియురాలి పెళ్లి చెడగొట్టి ప్రియుడు ముఖం చాటేయడంతో తనకు న్యాయం చేయాలని బాధితురాలు ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. వెన్నంపల్లికి చెందిన గోస్కుల సాయి కుమార్, మేడి శిరీష గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే, ఇంట్లో వాళ్లు అమ్మాయికి అనుకోకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న ప్రియుడు అమ్మాయి ఇంటికి […]

Update: 2021-11-14 11:10 GMT

దిశ, సుల్తానాబాద్ : ప్రియురాలి పెళ్లి చెడగొట్టి ప్రియుడు ముఖం చాటేయడంతో తనకు న్యాయం చేయాలని బాధితురాలు ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. వెన్నంపల్లికి చెందిన గోస్కుల సాయి కుమార్, మేడి శిరీష గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.

అయితే, ఇంట్లో వాళ్లు అమ్మాయికి అనుకోకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న ప్రియుడు అమ్మాయి ఇంటికి వెళ్లి మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని చెప్పాడు. దీంతో ఆ సంబంధం చెడిపోయింది. బాధిత పేరెంట్స్ కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా వారు ఇరు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇవ్వగా.. ఇరు కుటుంబ సభ్యులు నవంబర్ 14వ తేదీన ఎంగేజ్మెంట్ జరిపించాలని నిర్ణయించారు. అయితే, అబ్బాయి తండ్రి, అతను పెళ్లికి నిరాకరించడంతో బాధితురాలు వాళ్లింటి ఎదుట బైఠాయించింది. తనకు ఎలాగైనా న్యాయం చేయాలని కోరుతూ నిరసన చేపట్టింది.

Tags:    

Similar News