అడవి పంది దాడిలో బాలిక మృతి

దిశ‌, ఖ‌మ్మం: ఇప్ప‌పువ్వు సేక‌ర‌ణ‌కు వెళ్లిన గిరిజ‌న బాలిక‌ను అడవిపంది బలి తీసుకుంది. ఈ సంఘ‌ట‌న భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా చ‌ర్ల మండ‌లం పూనుగుప్ప అట‌వీ స‌మీప ప్రాంతంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రమణమ్మ కూతురు కవిత(14), సోదరుడు అరుణ్‌తో కలిసి బుధ‌వారం ఉదయం ఇప్ప‌పువ్వు ఏరుకునేందుకు అడవిలోకి వెళ్లారు. తల్లికి కొంత దూరంలో అక్కాత‌మ్ములిద్ద‌రూ క‌లిసి ఇప్ప‌పువ్వు సేక‌రిస్తున్నారు. పొద‌ల మాటు నుంచి దూసుకొచ్చిన అడవిపంది క‌విత‌పై ఒక్క‌సారిగా దాడి చేసింది. దీంతో భయంతో పరుగులు […]

Update: 2020-04-15 10:49 GMT

దిశ‌, ఖ‌మ్మం: ఇప్ప‌పువ్వు సేక‌ర‌ణ‌కు వెళ్లిన గిరిజ‌న బాలిక‌ను అడవిపంది బలి తీసుకుంది. ఈ సంఘ‌ట‌న భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా చ‌ర్ల మండ‌లం పూనుగుప్ప అట‌వీ స‌మీప ప్రాంతంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రమణమ్మ కూతురు కవిత(14), సోదరుడు అరుణ్‌తో కలిసి బుధ‌వారం ఉదయం ఇప్ప‌పువ్వు ఏరుకునేందుకు అడవిలోకి వెళ్లారు. తల్లికి కొంత దూరంలో అక్కాత‌మ్ములిద్ద‌రూ క‌లిసి ఇప్ప‌పువ్వు సేక‌రిస్తున్నారు. పొద‌ల మాటు నుంచి దూసుకొచ్చిన అడవిపంది క‌విత‌పై ఒక్క‌సారిగా దాడి చేసింది. దీంతో భయంతో పరుగులు తీసిన తల్లీకొడుకులు గ్రామ‌స్తుల‌తో క‌ల‌సి పందిని తరిమేందుకు సంఘటన స్థలానికి వచ్చారు. గ్రామస్తులు వచ్చేసరికి క‌విత తీవ్ర గాయాల‌తో స్పృహ కోల్పోయి ప‌డి ఉంది. వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా.. మార్గం మ‌ధ్య‌లోనే మృతి చెందింది. విషయం తెలుసుకున్న అటవీ సంరక్షణ అధికారి పీసీసీఎఫ్ శోభ మృతురాలి కుటుంబ‌ స‌భ్యుల‌కు సంతాపం తెలిపారు. అట‌వీశాఖ‌ నిబంధనల ప్రకారం బాలిక కుటుంబానికి గురువారం రూ. 5లక్షల ప‌రిహారం అంద‌జేయ‌నున్న‌ట్లు తెలిపారు.

Tags: Girl killed, wild pig, attack, Bhadradri kothagudem

Tags:    

Similar News