బస్సులో తల బయటపెట్టింది… తల తెగి నుజ్జు నుజ్జు అయ్యింది
దిశ, వెబ్ డెస్క్: రోడ్డు ప్రయాణాలు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. అప్రమతంగా ఉండకపోతే ప్రాణాలకే ముప్పు వస్తుంది. బస్సులో, రైలు లో ప్రయాణించేటప్పుడు చేతులు, తల బయటపెట్టకూడదని బస్సులో రాసి ఉంటుంది. అయినా సరే కొన్ని అనుకోని పరిస్థితిల్లో తల బయట పెట్టాల్సి వస్తుంది. అలా అనుకోని పరిస్థితి ఒక బాలిక ప్రాణం తీసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖంద్వా జిల్లాలోని రోషియా ఫేట్ వద్ద ఇండోర్-ఇచ్చాపూర్ రహదారిపై వెళ్తున్న బస్సులో ఒక బాలిక, ఆమె తల్లి […]
దిశ, వెబ్ డెస్క్: రోడ్డు ప్రయాణాలు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. అప్రమతంగా ఉండకపోతే ప్రాణాలకే ముప్పు వస్తుంది. బస్సులో, రైలు లో ప్రయాణించేటప్పుడు చేతులు, తల బయటపెట్టకూడదని బస్సులో రాసి ఉంటుంది. అయినా సరే కొన్ని అనుకోని పరిస్థితిల్లో తల బయట పెట్టాల్సి వస్తుంది. అలా అనుకోని పరిస్థితి ఒక బాలిక ప్రాణం తీసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖంద్వా జిల్లాలోని రోషియా ఫేట్ వద్ద ఇండోర్-ఇచ్చాపూర్ రహదారిపై వెళ్తున్న బస్సులో ఒక బాలిక, ఆమె తల్లి ప్రయాణిస్తున్నారు. అయితే బాలిక కు వాంతు వస్తునట్లు అనిపించడంతో కీటికీ బయటికి తల పెట్టింది. ఇంతలో వెనక నుండి వస్తున్న ఒక లారీ బాలికను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలిక తల తెగి నుజ్జునుజ్జు అయ్యింది. బస్సులో మొండెంతో బాలిక కొట్టుకోవడం చూసి ప్రయాణికులందరూ హతాశయులయ్యారు. కళ్ళముందే కన్నబిడ్డ పరిస్థితి చూసిన తల్లి గుండెలవిసేలా రోదించింది. ఒక చిన్న పొరపాటు నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు టిప్పర్ డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని, దర్యాప్తు చేపట్టారు.