ఘోస్ట్ మ్యారేజ్ : చనిపోయిన నటి బూడిదకు రూ. 8 లక్షలు

దిశ, ఫీచర్స్ : చైనాలో మరోసారి ఘోస్ట్ మ్యారేజ్ తెరమీదకు వచ్చింది. ఈ పురాతన దురాచారాన్ని ఆ దేశంలో ఇప్పటికే బహిష్కరించినా.. దీని ద్వారా అక్రమంగా డబ్బులు ఆర్జించే ప్రయత్నాలు ఇప్పటికీ పలుచోట్ల జరుగుతూనే ఉన్నాయి. ఒక వ్యక్తి చనిపోతే తనను ఒంటరిగా కాల్చినా లేదా ఖననం చేసినా.. తమ వంశవృద్ధిపై ఎఫెక్ట్ పడుతుందని చైనీయుల విశ్వాసం. చనిపోయిన మరో స్త్రీని లేదా తన బూడిద, అస్తికలను.. ఈ వ్యక్తితో పాటు పూడ్చితే ఆ ప్రభావం నుంచి […]

Update: 2021-11-28 04:00 GMT

దిశ, ఫీచర్స్ : చైనాలో మరోసారి ఘోస్ట్ మ్యారేజ్ తెరమీదకు వచ్చింది. ఈ పురాతన దురాచారాన్ని ఆ దేశంలో ఇప్పటికే బహిష్కరించినా.. దీని ద్వారా అక్రమంగా డబ్బులు ఆర్జించే ప్రయత్నాలు ఇప్పటికీ పలుచోట్ల జరుగుతూనే ఉన్నాయి. ఒక వ్యక్తి చనిపోతే తనను ఒంటరిగా కాల్చినా లేదా ఖననం చేసినా.. తమ వంశవృద్ధిపై ఎఫెక్ట్ పడుతుందని చైనీయుల విశ్వాసం. చనిపోయిన మరో స్త్రీని లేదా తన బూడిద, అస్తికలను.. ఈ వ్యక్తితో పాటు పూడ్చితే ఆ ప్రభావం నుంచి తప్పించుకోవచ్చని అదే పద్ధతి ఫాలో అవుతుంటారు.

ఇదిలా ఉంటే, చైనీస్ ఇన్‌ఫ్లుయన్సర్ ‘లువో జియావో మావో మావో జి’.. చైనీస్ టిక్ టాక్‌గా పిలువబడే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘డౌయిన్‌’లో పాపులర్. కొద్ది రోజులుగా డిప్రెషన్‌తో బాధపడుతున్న ఆమె.. తనకు చనిపోవాలనుందని ఓ వీడియో పోస్ట్ చేయగా, పెస్టిసైడ్ తాగి ఆత్మహత్య చేసుకోవాలని కొందరు సూచించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న లువో.. నిజంగానే ఆ పని చేసింది. లైవ్‌లో పెస్టిసైడ్ తాగి సూసైడ్ చేసుకుంది. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాక.. ఆమె శవానికి ఓ శ్మశాన వాటికలో దహన సంస్కారాలు నిర్వహించారు. అయితే ఈ సెలబ్రిటీ చితాభస్మానికి డిమాండ్ ఉండటంతో.. కాటికాపరి ఆ యాష్‌ను సేకరించాడు. మరో ముగ్గురితో కలిసి ‘ఘోస్ట్ మ్యారేజ్’ చేయాలనుకున్న కుటుంబానికి రూ. 8.2 లక్షలకు అమ్ముకున్నాడు. కాగా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News