నగర మేయర్‌కు ఊహించని షాక్..

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మేయర్‌గా పదవి బాధ్యతలు స్వీకరించిన గద్వాల విజయలక్ష్మికి ఊహించని షాక్ తగిలింది. మేయర్ పీఠం అధిష్టించి రెండు రోజులు గడువక ముందే జీహెచ్ఎంసీ అధికారులు అదిరిపోయే ఝలక్ ఇచ్చారు. ఫ్లెక్స్ విషయంలో రూ.లక్ష ఫైన్ కట్టాలంటూ నోటీసులు పంపించారు. వివరాల ప్రకారం.. మేయర్‌గా ఆమె ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఫిబ్రవరి-11వ తేదీన కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రధాన కూడలిలో భారీ ఫ్లెక్స్‌ను ఏర్పాటు చేశారు. అయితే, దానికోసం […]

Update: 2021-02-13 04:45 GMT

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మేయర్‌గా పదవి బాధ్యతలు స్వీకరించిన గద్వాల విజయలక్ష్మికి ఊహించని షాక్ తగిలింది. మేయర్ పీఠం అధిష్టించి రెండు రోజులు గడువక ముందే జీహెచ్ఎంసీ అధికారులు అదిరిపోయే ఝలక్ ఇచ్చారు. ఫ్లెక్స్ విషయంలో రూ.లక్ష ఫైన్ కట్టాలంటూ నోటీసులు పంపించారు.

వివరాల ప్రకారం.. మేయర్‌గా ఆమె ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఫిబ్రవరి-11వ తేదీన కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రధాన కూడలిలో భారీ ఫ్లెక్స్‌ను ఏర్పాటు చేశారు. అయితే, దానికోసం రాత పూర్వక అనుమతి పొందలేదనే కారణంతో పాటు, జీహెచ్ఎంసీ నిబంధనలు ఉల్లంఘించారని అధికారులు రూ.1లక్ష జరిమానా విధించారు. కాగా, ఈ జరిమానా నేరుగా మేయర్ విజయలక్ష్మికి కాకుండా, ఫ్లెక్స్ ఏర్పాటు చేసిన అతిష్ అగర్వాల్ అనే వ్యక్తికి విధించినట్లు సమాచారం. నగర ప్రథమ పౌరురాలిగా బాధ్యతలు చేపట్టిన రెండ్రోజుల్లోనే జీహెచ్‌ఎంసీ నుంచి చేదు అనుభవం ఎదురవడంతో ఏం చేయాలో తోచక టీఆర్ఎస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

Tags:    

Similar News