జర్మనీని ముంచెత్తుతున్న వరదలు

బెర్లిన్: పశ్చిమ యూరోప్ దేశాలను వరుణుడు ముంచెత్తుతున్నాడు. ఫ్రాన్స్, స్విజ్జర్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్ దేశాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, అతి భారీ వర్షాలతో జర్మనీ, బెల్జియం దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ఫలితంగా తీర ప్రాంతాలు వరదల్లో చిక్కుకుపోయాయి. వరదల ధాటికి పశ్చిమ యూరప్ దేశాల్లో ఇప్పటివరకు 123మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో అత్యధికంగా జర్మనీలోనే 103 మంది మృతిచెందగా, 1300 మంది గల్లంతయినట్టు అధికారులు వెల్లడించారు. బెల్జియంలో మృతుల సంఖ్య 20కి చేరింది. వరదల్లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు […]

Update: 2021-07-16 11:38 GMT

బెర్లిన్: పశ్చిమ యూరోప్ దేశాలను వరుణుడు ముంచెత్తుతున్నాడు. ఫ్రాన్స్, స్విజ్జర్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్ దేశాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, అతి భారీ వర్షాలతో జర్మనీ, బెల్జియం దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ఫలితంగా తీర ప్రాంతాలు వరదల్లో చిక్కుకుపోయాయి. వరదల ధాటికి పశ్చిమ యూరప్ దేశాల్లో ఇప్పటివరకు 123మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో అత్యధికంగా జర్మనీలోనే 103 మంది మృతిచెందగా, 1300 మంది గల్లంతయినట్టు అధికారులు వెల్లడించారు.

బెల్జియంలో మృతుల సంఖ్య 20కి చేరింది. వరదల్లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు 900 మంది ఆర్మీ సిబ్బంది రంగంలోకి దిగినట్టు జర్మనీ ప్రభుత్వం వెల్లడించింది. భారీ వర్షాలు, వరదలతో అత్యధికంగా ప్రభావితమైన జర్మనీలోని పలు ప్రాంతాల్లో ఇళ్లన్నీ నీటమునిగాయి. కొన్ని చోట్ల కూలిపోయాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. సమాచార వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News