కాగ్‌గా జీసీ ముర్ము ప్రమాణం

న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ గిరీష్ చంద్ర ముర్ము కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)గా శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోడీ, ఇతరుల సమక్షంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ముర్ముతో ప్రమాణ స్వీకారం చేయించారు. జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా బుధవారం రాజీనామా చేసిన ముర్ము కాగ్‌గా గురువారం ఎంపికయ్యారు. ఈ పదవిలో ఆరేళ్లు కొనసాగనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అన్ని వ్యయాల ఆడిటింగ్ ఇకపై ముర్ము బాధ్యతగా […]

Update: 2020-08-08 10:45 GMT

న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ గిరీష్ చంద్ర ముర్ము కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)గా శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోడీ, ఇతరుల సమక్షంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ముర్ముతో ప్రమాణ స్వీకారం చేయించారు.

జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా బుధవారం రాజీనామా చేసిన ముర్ము కాగ్‌గా గురువారం ఎంపికయ్యారు. ఈ పదవిలో ఆరేళ్లు కొనసాగనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అన్ని వ్యయాల ఆడిటింగ్ ఇకపై ముర్ము బాధ్యతగా ఉండనుంది. 1985 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన జీసీ ముర్ము గతేడాది రిటైర్‌మెంట్‌కు ముందే రాజీనామా చేశారు. కాగ్‌గా ఎంపికైన తొలి ట్రైబల్ ముర్మునే కావడం గమనార్హం.

Tags:    

Similar News