గ్యాస్ బాదుడు.. మరోసారి పెరిగిన ధర ఎంతంటే..?

దిశ, వెబ్‌డెస్క్: పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యుడికి.. వంట గ్యాస్ ధరల పెంపు గుదిబండలా మారింది. తాజాగా ఎల్పీజీ సిలిండర్ ధర మరోసారి భారీగా పెరిగింది. నేటి నుంచి సిలిండర్‌ బుక్ చేసే వారిపై అదనపు భారం పడబోతోంది. ఒక్కో గ్యాస్ సిలిండర్‌పై చమురు సంస్థలు ఏకంగా రూ.25 పెంచాయి. దీంతో వంట గ్యాస్ ధర రూ.846.50కి చేరింది. ఈ కొత్త ధరలు బుధవారం అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. హైదరాబాద్‌లో నిన్నటి […]

Update: 2021-02-24 21:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యుడికి.. వంట గ్యాస్ ధరల పెంపు గుదిబండలా మారింది. తాజాగా ఎల్పీజీ సిలిండర్ ధర మరోసారి భారీగా పెరిగింది. నేటి నుంచి సిలిండర్‌ బుక్ చేసే వారిపై అదనపు భారం పడబోతోంది. ఒక్కో గ్యాస్ సిలిండర్‌పై చమురు సంస్థలు ఏకంగా రూ.25 పెంచాయి. దీంతో వంట గ్యాస్ ధర రూ.846.50కి చేరింది. ఈ కొత్త ధరలు బుధవారం అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి.

హైదరాబాద్‌లో నిన్నటి వరకు సిలిండర్ ధర రూ.821.50గా ఉంది. కాగా, తాజా ధర పెంపుతో రూ.846.50కి చేరింది. ఇక ఢిల్లీలో సిలిండర్ ధర రూ.794కి చేరింది. బెంగళూరులో రూ.797, చెన్నైలో రూ.810, ముంబైలో రూ.794, రూ.కోల్‌కతాలో రూ.820కి చేరింది. కాగా, ఈ నెలలో మొత్తంగా మూడు సార్లు గ్యాస్ సిలిండర్‌పై రూ.100 మేర పెరిగాయి. ఫిబ్రవరి 4న రూ.25 పెంచగా, 15న మరో రూ.50 పెంచారు. తాజాగా రూ.25 పెంచడంతో ఈ ఒక్క నెలలోనే రూ.100 పెరిగింది.

Tags:    

Similar News