గంటాకు ఇండియన్ బ్యాంక్ షాక్

విశాఖపట్నం: మాజీమంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావుకు ఇండియన్ బ్యాంక్ షాకిచ్చింది. రుణం ఎగవేత కేసులో ఆయన ఆస్తులను వేలం వేయడానికి సిద్ధమైంది. ఈ నెల 16న వేలం వేయనుండగా, ఇందులో పాల్గొనేందుకు 15వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నట్టు వెల్లడించింది. కాగా, గంటా ఒకప్పుడు డైరెక్టర్‌గా ఉన్న ప్రత్యూష కంపెనీ.. బ్యాంకు నుంచి రూ.141.68కోట్లు రుణం తీసుకుంది. దీనికి సంబంధించిన రుణం ఎగవేయడంతో ఇప్పటికే ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. గంటాతో పాటు మరో ఏడుగురు ప్రత్యూష డైరెక్టర్ల […]

Update: 2020-03-10 23:10 GMT

విశాఖపట్నం: మాజీమంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావుకు ఇండియన్ బ్యాంక్ షాకిచ్చింది. రుణం ఎగవేత కేసులో ఆయన ఆస్తులను వేలం వేయడానికి సిద్ధమైంది. ఈ నెల 16న వేలం వేయనుండగా, ఇందులో పాల్గొనేందుకు 15వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నట్టు వెల్లడించింది. కాగా, గంటా ఒకప్పుడు డైరెక్టర్‌గా ఉన్న ప్రత్యూష కంపెనీ.. బ్యాంకు నుంచి రూ.141.68కోట్లు రుణం తీసుకుంది. దీనికి సంబంధించిన రుణం ఎగవేయడంతో ఇప్పటికే ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. గంటాతో పాటు మరో ఏడుగురు ప్రత్యూష డైరెక్టర్ల ఆస్తులూ వేలం వేయనున్నారు.

tags: ganta srinivasa rao, auction, indian bank, prathyusha company, loan,

Tags:    

Similar News