పేదలకు 'దాదా' సాయం !
దేశమంతా కరోనా భయాందోళనలతో లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోవడంతో పేదలు, రోజువారీ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు తమ వంతు సాయం అందిస్తున్నారు. కాగా, బీసీసీఐ అధ్యక్షుడు, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రూ. 50 లక్షల విలువైన బియ్యాన్ని షెల్టర్లలో ఉన్న వారికి అందజేసి తన మంచి మనసును చాటుకున్నాడు. కరోనా నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పేదలకు ప్రభుత్వ సూల్స్‌లో ఆశ్రయం ఇవ్వగా.. వీరికి అవసరమయ్యే బియ్యాన్ని […]
దేశమంతా కరోనా భయాందోళనలతో లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోవడంతో పేదలు, రోజువారీ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు తమ వంతు సాయం అందిస్తున్నారు. కాగా, బీసీసీఐ అధ్యక్షుడు, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రూ. 50 లక్షల విలువైన బియ్యాన్ని షెల్టర్లలో ఉన్న వారికి అందజేసి తన మంచి మనసును చాటుకున్నాడు. కరోనా నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పేదలకు ప్రభుత్వ సూల్స్‌లో ఆశ్రయం ఇవ్వగా.. వీరికి అవసరమయ్యే బియ్యాన్ని సౌరవ్ గంగూలీ, లాల్ బాబా రైస్ కంపెనీ కలిసి అందించారు.
అంతే కాకుండా, ఈడెన్ గార్డెన్స్‌లో ఉన్న ఇండోర్ సదుపాయాలతో పాటు ఆటగాళ్ల డార్మిటరీలను తాత్కాలిక మెడికల్ సెంటర్లుగా ఉపయోగించుకోమని గంగూలీ బెంగాల్ ప్రభుత్వానికి లేఖ రాశాడు. ప్రస్తుత సమయంలో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ తరపున ఏ విధమైన సాయమైనా అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.
మరోవైపు, కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ రూ.25 లక్షలు, క్యాబ్ అధ్యక్షుడు అవిషేక్ దాల్మియా రూ. 5 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ప్రకటించారు.
Tags: BCCI President, Bengal Cricket Association President, Donation, Rice Distribution, Corona