నితిన్.. ఏమిటీ డైలాగ్?
దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో నితిన్ నటించిన ‘భీష్మ’ సినిమా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. కమర్షియర్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించగా సూర్యదేవర నాగవంశీ నిర్మాత. అయితే ఆజన్మ బ్రహ్మచారి అయిన భీష్మాచార్యులవారి పేరును సినిమాలో అల్లరి చేస్తూ అమ్మాయిల వెంటపడే లవర్ బాయ్‌కు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది తెలంగాణ గంగపుత్ర సంక్షేమ సంఘం. హీరో, దర్శక నిర్మాతలు, ఎడిటర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు […]
దిశ, వెబ్‌డెస్క్:
యంగ్ హీరో నితిన్ నటించిన ‘భీష్మ’ సినిమా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. కమర్షియర్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించగా సూర్యదేవర నాగవంశీ నిర్మాత. అయితే ఆజన్మ బ్రహ్మచారి అయిన భీష్మాచార్యులవారి పేరును సినిమాలో అల్లరి చేస్తూ అమ్మాయిల వెంటపడే లవర్ బాయ్‌కు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది తెలంగాణ గంగపుత్ర సంక్షేమ సంఘం. హీరో, దర్శక నిర్మాతలు, ఎడిటర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ సంఘం సభ్యులు.
సినిమాలో నితిన్ డైలాగ్‌ను కంప్లైంట్లో ప్రధానంగా ప్రస్తావించారు. మహాభారతంలో దుర్యోధనుడు, దుశ్శాసనుడు, యముడు, శని, శకుని ఇలాంటి ఎన్నో పేర్లుండగా ఆజన్మ బ్రహ్మచారి అయిన భీష్ముడి పేరు ఎందుకు పెట్టావమ్మ అన్న నితిన్ డైలాగ్పై అసహనం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన మలక్‌పేట పోలీసులు… భీష్మ సినిమా యూనిట్ హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు అందిందని తెలిపారు. దీనిపై విచారించి చర్యలు తీసుకుంటామన్నారు.