‘జగన్ సంతోషం కోసం.. ఎంపీ రఘురామపై థర్డ్ డిగ్రీ’
దిశ, వెబ్‌డెస్క్: ఎంపీ రఘురామ కృష్ణం రాజుపై వైసీపీ ప్రభుత్వం, సీబీ సీఐడీ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపించారు. ఆయనపై అక్రమ కేసులు పెట్టడమే ఒక నేరమైతే.. కర్రలు విరిగేలా కొట్టడం మరో దుర్మార్గపు చర్య అని వ్యాఖ్యానించారు. రూల్స్ ప్రకారం కస్టడీలో ఉన్న వారిని కొట్టడానికి వీలు లేదని గుర్తు చేసిన ఆయన.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని సంతోష పెట్టడానికి ఒక ఎంపీపై థర్డ్ డిగ్రీ […]
దిశ, వెబ్‌డెస్క్: ఎంపీ రఘురామ కృష్ణం రాజుపై వైసీపీ ప్రభుత్వం, సీబీ సీఐడీ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపించారు. ఆయనపై అక్రమ కేసులు పెట్టడమే ఒక నేరమైతే.. కర్రలు విరిగేలా కొట్టడం మరో దుర్మార్గపు చర్య అని వ్యాఖ్యానించారు. రూల్స్ ప్రకారం కస్టడీలో ఉన్న వారిని కొట్టడానికి వీలు లేదని గుర్తు చేసిన ఆయన.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని సంతోష పెట్టడానికి ఒక ఎంపీపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా అంటూ ప్రశ్నించారు. ప్రాణాలు కాపాడాల్సిన రాష్ట్ర సీఎం.. ఇటువంటి వాటిని ప్రొత్సహించడం ఏంటని.. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. త్వరలోనే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని జీవీ ఆంజనేయులు హెచ్చరించారు.
Sri G V Anjaneyulu addressing the media about the illegal arrest of MP Raghu Rama Krishnam Raju – LIVE
https://t.co/IYtcQVLAdz— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) May 16, 2021