పీజీ కాలేజీలో అవినీతి కంపు
దిశ, ఖమ్మం: విద్యాబుద్ధులను నేర్పించే గురువులు అవినీతి మ రకులు అంటించుకుంటున్నారు. కళాశాలకు వచ్చే ప్రతి పై సా ఖర్చు చేసి విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాల్సిన గురువులు తప్పటడుగులు వేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రభుత్వ పీజీ కళాశాలలో అవినీతి రోజు రోజుకు పెరిగిపోతోంది. ఉద్యోగంలో ఉన్నప్పడే నాలుగు రాళ్లు వెనుక వేసుకోవాలని ఆ లోచనతో పనిచేస్తున్నారు. విద్యార్థులకు కోసం ప్రభుత్వ నుంచి పీజీ కళాశాలకు వచ్చే నిధులను వాటలు వేసుకొని పంచుకుంటున్నారు. కాకతీయ […]
దిశ, ఖమ్మం: విద్యాబుద్ధులను నేర్పించే గురువులు అవినీతి మ రకులు అంటించుకుంటున్నారు. కళాశాలకు వచ్చే ప్రతి పై సా ఖర్చు చేసి విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాల్సిన గురువులు తప్పటడుగులు వేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రభుత్వ పీజీ కళాశాలలో అవినీతి రోజు రోజుకు పెరిగిపోతోంది. ఉద్యోగంలో ఉన్నప్పడే నాలుగు రాళ్లు వెనుక వేసుకోవాలని ఆ లోచనతో పనిచేస్తున్నారు. విద్యార్థులకు కోసం ప్రభుత్వ నుంచి పీజీ కళాశాలకు వచ్చే నిధులను వాటలు వేసుకొని పంచుకుంటున్నారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి ఖమ్మం ప్రభుత్వ పీజీ కళాశాలకు వచ్చే నిధులు భారీగా పక్కదారి పట్టాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న విద్యార్థులకు ఉన్నత చదువులకు కోసం ఒకటే పీజీ కళాశాల. ఈ కాలేజ్‌లో ఎంబీఏ, ఎంఏ(ఎకనామిక్స్), ఎం.కామ్, ఎంఎస్‌డ బ్ల్యూ, ఎంఏ ( ఇంగ్లీష్) ఉన్నత చదువులను కొనసాగిస్తున్నారు. ప్రతి ఏటా విద్యాసంవత్సరంలో ప్రతి కోర్సులో విద్యార్థులు దరఖాస్తు చేసుకుని విద్యను అభ్యసిస్తారు. కాకతీయ యూనివర్సిటీ విద్యార్ధులకు విద్యా ప్రమాణాలు పెంచేందుకు, కశాశాల అభివృద్ధి కోసం ప్రతి ఏటా నిధులను అన్ని ప్రభుత్వ కళాశాలకు మంజూరు చేస్తుంది. కానీ ఖమ్మం పీజీ కళాశాలలో మాత్రం విద్యార్ధులకు వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. విద్యార్థులకు ఎలాంటి వసతులు కల్పించకుండానే.. కల్పించామని వివిధ ఎకౌంట్‌ల నుంచి లక్షల నిధులు డ్రా చేసి చేతివాటం ప్రదర్శించారు. ఈ పీజీ కళాశాలల్లో కొంత మంది సిబ్బంది సంవత్సరాల తరబడి పనిచేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కొన్ని కోర్సులు నిర్వహించట్లేదు. దీంతో విద్యార్థులు హాజరు కావట్లేదు. పరీక్షల ముందు హాజరు తక్కువైందని అనధికారిక జాబితా కళాశాల వద్ద పెట్టి అక్రమ వసూళ్లుకు పాల్పడుతున్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అధ్యాపకులు తరగతులకు రాకపోయినా వారి హాజరు రిజిస్టర్‌లో అక్రమ విధానంలో వేయిస్తూ సిబ్బంది, ప్రధాన ఉపాధ్యాయులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. మంచి లక్ష్యంతో ప్రవేశపెట్టిన కొన్ని సంస్కరణలు కళాశాలలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అధ్యాపకులు, ప్రధాన ఉపాధ్యాయులు, సిబ్బంది అక్రమాలు పాల్పపడితే నాణ్యమైన విద్య అందుతుందని వర్సిటీ అధికారులు భావిస్తున్నారు.
రెండేళ్లుగా ఇన్చార్జి ప్రిన్సిపాలే దిక్కు..
ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్న పీజీ కళాశాలకు ఇంచార్జ్ ప్రన్సి పాలే దిక్కు. ప్రతి రోజు కళాశాలకు రావలసిన ప్రన్సిపాల్ రాక పోడంతో సిబ్బంది పాలన నడుస్తుంది. గతంలో ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న డాక్టర్ వరలక్ష్మిను కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్‌లో డీన్‌గా బదిలీ అయ్యారు. దాంతో పాటు ఖమ్మం పీజీ కళాశాలకు ఇన్‌చార్జ్‌గా ఉత్తర్వులు ఇచ్చారు. ఆమె వరంగల్‌లోనే ఉంటూ ఎప్పుడో ఒకసారి చుట్టం చూ పులా వచ్చిపోతున్నారు. ప్రతి నెల బిల్లు, ఉపాధ్యాయుల రిజిస్ట ర్, చెక్‌లపై సంతకాలు లాంటి ఉంటే కళాశాలల్లో పని చేసే సి బ్బంది వరంగల్‌కు వెళ్లి సంతకాలు పెట్టించుకొని వస్తున్నారు. ఈ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్ 14 నుంచి 15 సంవత్సరా లగా పనిచేస్తున్నారు. యూనివర్సిటీ ప్రకారం 2 సంవత్సరాలే ఉండాలి కానీ అధికారులతో నయానా భయానా ఇచ్చి మేనేజ్ చేస్తున్నాడు. ఈ కళాశాలలో ఉన్న అకౌంట్‌లో నుండి నిధులను ఫేక్ బిల్లు పెట్టి పెద్ద ఎత్తున నగదు డ్రా చేసిన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కళాశాలలో టీచింగ్ స్టాఫ్ లో ఇద్దరు కాంట్రాక్ట్, 14 మంది పార్ట్‌టైంలో పనిచేస్తున్నారు. ఆఫీస్ స్టాఫ్ 7 మంది ఉన్నారు. ఇక్కడ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందడం లేదని విద్యార్థులు బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో కళాశాలలో ఇప్పటి వరకు విద్యార్ధులకు ఆన్‌లైన్ ద్వారా విద్యను అందించా రు. ఫిబ్రవరి 1 నుంచి ప్రభుత్వం కాస్లులు ప్రారంభించాలని ప్ర భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇంకా కళాశాలలు ప్రారం భానకి రెండు రోజులు ఉన్న ఉపాధ్యాయులు, సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఖమ్మం పీజీ కళాశాలలో జరుగుతున్న అవినీతి పై యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.