ఆ ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన రోడ్లు చెరువులు, కుంటలను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్లు ఇళ్లలోకి, కాలనీల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు ఎక్కడికక్కడా జగదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. దీంతో సంబంధిత అధికారులు, సిబ్బంది సహాయక చర్యల్లో మునిగిపోయారు. ఇదిలాఉండగా, రాష్ట్రంలోని 35 ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని వాతవరణ శాఖ వెల్లడించింది. ఘట్‌కేసర్‌లో అత్యధికంగా 32.3 సెం.మీ వర్షపాతం నమోదు కాగా, […]
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన రోడ్లు చెరువులు, కుంటలను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్లు ఇళ్లలోకి, కాలనీల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు ఎక్కడికక్కడా జగదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. దీంతో సంబంధిత అధికారులు, సిబ్బంది సహాయక చర్యల్లో మునిగిపోయారు.
ఇదిలాఉండగా, రాష్ట్రంలోని 35 ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని వాతవరణ శాఖ వెల్లడించింది. ఘట్‌కేసర్‌లో అత్యధికంగా 32.3 సెం.మీ వర్షపాతం నమోదు కాగా, హయత్ నగర్‌లో 28.4సెం.మీ, సరూర్ నగర్‌లో 27సెం.మీ, ముషీరాబాద్‌లో 26సెం.మీ వర్షపాతం నమోదైంది.