భక్త జనసంద్రంగా రాజన్న క్షేత్రం..
దిశ, వేములవాడ : దక్షిణ కాశీగా పేరు గాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్త జన సంద్రమైంది. సోమవారం తెల్లవారుజాము నుంచే అమ్మవారి, స్వామి వార్ల దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. లఘు దర్శనం ద్వారా దర్శనం చేసుకున్న భక్తులు కోడె మొక్కులు చెల్లించుకున్నారు. కళ్యాణ మండపంలో ప్రత్యేక పూజలు, వ్రతాలు చేశారు. ఈ ఒక్కరోజే స్వామి వారిని సుమారుగా 25 వేల మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు అంచనా […]
దిశ, వేములవాడ : దక్షిణ కాశీగా పేరు గాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్త జన సంద్రమైంది. సోమవారం తెల్లవారుజాము నుంచే అమ్మవారి, స్వామి వార్ల దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. లఘు దర్శనం ద్వారా దర్శనం చేసుకున్న భక్తులు కోడె మొక్కులు చెల్లించుకున్నారు. కళ్యాణ మండపంలో ప్రత్యేక పూజలు, వ్రతాలు చేశారు. ఈ ఒక్కరోజే స్వామి వారిని సుమారుగా 25 వేల మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు అంచనా వేశారు. కొవిడ్ నిబంధనల ప్రకారం అధికారులు భక్తులకు దర్శనం కల్పించారు.