మిత్రులను శత్రువులుగా మార్చిన మద్యం….

దిశ వెబ్ డెస్క్ : వారు ముగ్గురు మంచి స్నేహితులు. డ్యామ్ అందాలు చూసి ఆనందించాలని బయలు దేరారు. మార్గం మధ్యలో మద్యం తాగి వారి ఆనందాన్ని రెట్టింపు చేసుకున్నారు. ఇంతలో చిన్న వాగ్వాదం మిత్రులను శత్రువులుగా మార్చింది. చివరికి స్నేహితుని ప్రాణాలను తీసేలా చేసింది. ఇద్దరు స్నేహితులను కటకటాల పాలు చేసింది. ఘటన వివరాల్లోకెళితే….జైపూర్ కు చెందిన వినోద్ మెహ్రా, సోను, అమిత్ లు మంచి స్నేహితులు. టోంక్ జిల్లాలోని బిలాస్ పూర్ డ్యామ్ చూసేందుకు […]

Update: 2020-09-26 07:59 GMT
మిత్రులను శత్రువులుగా మార్చిన మద్యం….
  • whatsapp icon

దిశ వెబ్ డెస్క్ :
వారు ముగ్గురు మంచి స్నేహితులు. డ్యామ్ అందాలు చూసి ఆనందించాలని బయలు దేరారు. మార్గం మధ్యలో మద్యం తాగి వారి ఆనందాన్ని రెట్టింపు చేసుకున్నారు. ఇంతలో చిన్న వాగ్వాదం మిత్రులను శత్రువులుగా మార్చింది. చివరికి స్నేహితుని ప్రాణాలను తీసేలా చేసింది. ఇద్దరు స్నేహితులను కటకటాల పాలు చేసింది.

ఘటన వివరాల్లోకెళితే….జైపూర్ కు చెందిన వినోద్ మెహ్రా, సోను, అమిత్ లు మంచి స్నేహితులు. టోంక్ జిల్లాలోని బిలాస్ పూర్ డ్యామ్ చూసేందుకు వారంతా శుక్రవారం వెళ్లారు. అనంతరం అక్కడే ముగ్గురు కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత తిరుగు ప్రయాణంలో మరో సారి వైన్స్ షాపు వద్ద ఆగారు. మద్యం తాగుతుండగా అమిత్ తో వినోద్ మెహ్రా, సోనులకు వాగ్వాదం మొదలైంది. దీంతో వినోద్, సోనులు కలిసి అమిత్ గొంతు నులిమి చంపేశారు. అనంతరం శవాన్ని దగ్గరలోని ఓ చెరువులో పడేశారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయారు. దీంతో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News